తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి గ్రూప్ 1 రిక్రూట్ మెంట్ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణ గ్రూప్-1 లో భారత దేశ చరిత్రలోనే పెద్ద స్కాం జరిగింది. గ్రూప్ మెయిన్స్ కు ఒక హాల్ టికెట్, ప్రిలిమ్స్ కు మరో హాల్ టికెట్ ఇచ్చారు.. పరీక్ష రాసింది 21,093అయితే ..ఫలితాలు 21,103 మందికి ఇచ్చారు.. పరీక్ష రాయకుండానే 10 మంది ఎలా వచ్చారు.. హాల్ టికెట్ నెంబర్ పక్క పక్కనే ఉన్న 654 మందికి ఒకే మార్కులు వచ్చాయి.. ఇది ఎలా సాధ్యం.. ప్రొఫెసర్ లతో ఎందుకు కరెక్షన్ చేయించలేదు..
Also Read:PM Modi: HCU భూముల వ్యవహారంపై తొలిసారిగా స్పందించిన ప్రధాని
చాలా సెంటర్ లలో 10139 మంది రాస్తే 69 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు.. కానీ సెంటర్ నెంబర్ 18,19 అనే రెండు సెంటర్ లలో 1497 రాస్తే 74 మందికి జాబ్ లు వచ్చాయి.. ఈ రెండు సెంటర్ లలో కేవలం ఆడవాళ్ళను మాత్రమే ఎందుకు పరీక్ష రాయించారు.. సెంటర్ నెంబర్ 19 లో పరీక్ష రాసిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కోడలుకు 206 ర్యాంక్ వచ్చింది.. ST లలో ఈమెకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.. ఇది నాకు అనుమానంగా ఉంది.. పూజిత రెడ్డి అనే అమ్మాయి పరీక్ష రాసింది. ఆమెకు 483 మార్కులు వచ్చాయి అని డిక్లేర్ చేశారు.. ఆమె రీకౌంటింగ్ పెట్టుకుంటే 423 మార్కులు వచ్చాయి.. రీ కౌంటింగ్ పెట్టుకుంటే 60 మార్కులు తగ్గాయి అంటే.. కరెక్షన్ లో ఎన్ని తప్పులు ఉన్నాయో అర్థం అవుతుంది..
Also Read:Chittoor: ప్రేమ పెళ్లి.. తండ్రికి సీరియస్‌గా ఉందని పుట్టింటికి వెళ్లి అనంతలోకాలకు వివాహిత
దీనిమీద జ్యూడిషియల్ ఎంక్వైరీ లేదా సీబీఐ ఎంక్వైరీ వేయాలి.. తప్పు ఉంది అని చెబితే కేస్ లు పెడుతున్నారు.. 563 మందిలో ఒక్కరినే ఇంటర్వ్యూకి పిలిచారు.. 1:2 పిలవకుండా ఒక్కరినే ఎందుకు పిలిచారు.. మా హయాంలో లీక్ జరిగితే వెంటనే రద్దు చేశారు.. ఈ విషయంపై బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదు.. బండి సంజయ్ కు సవాలు విసురుతున్నాను.. కేంద్రంలో హోంశాఖ లో ఉన్న బండి సంజయ్ దీనిపై విచారణ చేయించాలి.. ఎన్నికల ముందు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైంది..
Also Read:JR NTR : వార్-2లో ఎన్టీఆర్ షర్ట్ లెస్ యాక్షన్..?
అప్పుడు అశోక్ నగర్ వెళ్లి విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ చూపించిన రాహుల్ గాంధీ కోదండరాంలు ఇప్పుడు ఎక్కడికి పోయారు.. బీజేపీ కాంగ్రెస్ లు మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నారు.. గ్రూప్ 1 లో కోట్ల రూపాయల స్కాం జరిగింది.. దీనిని వెంటనే రద్దు చేయాలి.. దీని తర్వాత నాపై కేసు పెడతారు.. పొద్దున్నే మా ఇంటికి పోలీసులు వస్తారు.. అయినా నేను బయపడను” అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.