YSRCP: విశాఖపట్నంలో అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ నేతలు ఘన నివాళి అర్పించారు. ఇక, ఎల్ఐసీ జంక్షన్ దగ్గర అంబేడ్కర్ విగ్రహానికి రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పండుల రవీంద్రబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Read Also: PM Modi: కాంగ్రెస్‌కి ఓటు బ్యాంక్ వైరస్.. వక్ఫ్ చట్టంపై మోడీ సంచలనం..
ఇక, వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ.. చంద్రబాబు ఏ దమ్ముతో అంబేడ్కర్ స్మృతి వనం ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నాడు? అని ప్రశ్నించారు. అంబేడ్కర్ స్మృతి వనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి చంద్రబాబుకి ఏ హక్కు ఉందన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతా.. మా పార్టీ నుంచి డబ్బులు వేసుకుని అంబేడ్కర్ స్మృతి వనాన్ని కాపాడుకుంటాం.. దేశంలో సామాజిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయి.. వక్ఫ్ చట్టం తీసుకురావడం అన్యాయం అన్నారు. ఇక, చంద్రబాబు తెచ్చిన పీ-4 నమ్మశక్యంగా లేదు.. మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలు అవుతాయని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు చెప్పుకొచ్చారు.