MI vs DC: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు (ఏప్రిల్ 13) న ఢిల్లీలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. టాస్ ఒడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో… ప్రారంభంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 12 బంతుల్లో 18 పరుగులు చేసి త్వరగా వెనుదిరిగినప్పటికీ, ర్యాన్ రికెల్టన్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 పరుగులు అద్భుతంగా ఆడారు.
ఆ తర్వాత, మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మ చెలరేగి ఆడాడు. 33 బంతుల్లో 59 పరుగులు చేసి ఇన్నింగ్స్ లో మరోసారి కీలక పాత్ర పోషించాడు. ఆఖర్లో నామన్ ధీర్ 17 బంతుల్లో 38 పరుగులతో జట్టును భారీ స్కోర్‌కు చేర్చాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. తన 4 ఓవర్లలో కేవలం 23 పరుగులే ఇవ్వడంతో పాటు రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. విప్రాజ్ నిగమ్ కూడా రెండు వికెట్లు తీశాడు. కానీ మిగిలిన బౌలర్లు ఎక్కువ పరుగులు ఇచ్చారు. మొత్తంగా ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 205/5 స్కోరు చేయగా, ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యం ఉందని చెప్పొచ్చు. ముంబై విజయం సాధించాలంటే బౌలింగ్‌లో మెరుపులు మెరిపించాల్సిన అవసరం ఉంది. ఇక చూడాలి మరి ఢిల్లీ క్యాపిటల్స్ ఈ లక్ష్యాన్ని ఛేదించగలదా లేదా? అని.