Cyber attack: మయన్మార్ భూకంప రెస్క్యూలో పాల్గొన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(IAF) విమానాలపై సైబర్ దాడి జరిగింది. ఐఏఎఫ్‌కి చెందిన C-130J విమానం మయన్మార్‌లో ప్రయాణిస్తున్నప్పుడు GPS-స్పూఫింగ్ దాడిని ఎదుర్కొన్నట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి.
ఇటీవల మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భూకంప బాధితులకు సాయం చేసేందుకు భారత ప్రభుత్వం ‘‘ఆపరేషన్ బ్రహ్మ’’ని ప్రారంభించింది. భూకంప బాధితులకు రిలీఫ్ మెటీరియల్స్‌తో పాటు రక్షణ సిబ్బందిని పంపింది. రెస్య్కూ కార్యక్రమానికి వెళ్లిన సమయంలోనే విమానం సైబర్ అటాక్‌కి గురైంది.
Read Also: Karnataka: 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం, హత్య.. నిందితుడి ఎన్‌కౌంటర్..
GPS-స్పూఫింగ్ అనేది విమానం ప్రయాణ మార్గాన్ని తప్పుదారి పట్టించే ఒక సైబర్ దాడి. స్ఫూఫింగ్ నిజమైన కోఆర్డినేట్స్‌ని మార్చి వేసి తప్పుదాడి పట్టిస్తుంది. అయితే, సురక్షితమైన నావిగేషన్‌ని నిర్ధారించడానికి వైమానిక దళ పైలట్లు వెంటనే ఇంటర్నల్ నావిగేషన్ సిస్టమ్(INS)కి మారారని రక్షణ వర్గాలు చెప్పాయి.
GPS స్పూఫింగ్ అనేది ఒక రకమైన సైబర్ దాడి, ఇక్కడ నకిలీ సిగ్నల్స్ నిజమైన ఉపగ్రహ డేటాను అధిగమించి నకిలీ సిగ్నల్స్ నిజమైనవిగా భ్రమించచేసి, విమానం గందరగోళానికి గురయ్యేలా చేస్తాయి. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో, ఇరాన్ ప్రాంతంలో ఇలాంటి స్పూఫింగ్ సంఘటనలు జరిగాయి. నవంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు అమృత్‌సర్, జమ్మూ సమీపంలో 465 కేసులు నమోదయ్యాయి.