15
Tuesday
April, 2025

A News 365Times Venture

Hyundai Exter Hy CNG: హ్యుందాయ్ ఎక్స్టర్ హై CNG కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే?

Date:

హ్యుందాయ్ భారత మార్కెట్లో వివిధ విభాగాలలో వాహనాలను విక్రయిస్తుంది. ఇటీవల ఎంట్రీ-లెవల్ SUVగా అందించిన Exter Hy CNG, కొత్త వేరియంట్‌ ఎక్స్ ను లాంచ్ చేసింది. దీనిలో అనేక ఫీచర్లు అందించారు. ముఖ్యంగా యూత్ ను ఆకర్షించడానికి ఈ వేరియంట్ ను తీసుకొచ్చింది. కొత్త వేరియంట్‌ను CNGలో బేస్ వేరియంట్‌గా అందిస్తున్నారు. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, 4.2 అంగుళాల కలర్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, H-ఆకారపు LED టెయిల్ ల్యాంప్, డ్రైవర్ సీట్ హైట్ సర్దుబాటు, కీ-లెస్ ఎంట్రీ వంటి ఫీచర్లతో వస్తోంది.

Also Read:Crown Prince of Dubai: రేపు భారత్‌కి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్.. పీఎం మోడీ, జైశంకర్‌తో భేటీ..

హ్యుందాయ్ SUV ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. దీనికి 1.2 లీటర్ కెపాసిటి గల కప్పా ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్‌తో, SUV 69 PS శక్తిని, 95.2 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందించారు. హ్యుందాయ్ ఎక్స్‌టర్ కొత్త వేరియంట్ EX భారత మార్కెట్లో రూ. 7.50 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు (హ్యుందాయ్ ఎక్స్‌టర్ హై CNG EX వేరియంట్ ధర) విడుదల చేశారు. ఎక్స్‌టార్‌ను హ్యుందాయ్ ఎంట్రీ లెవల్ SUV విభాగంలో అందిస్తోంది. ఈ విభాగంలో, ఇది టాటా పంచ్, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి SUV లతో నేరుగా పోటీపడుతుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

CM Revanth Reddy: భూభారతి పోర్టల్‌ను ప్రజలకు అంకితమిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భూ సమస్యల ప‌రిష్కారం, లావాదేవీల‌కు సంబంధించిన స‌మాచారం...

ಸಮಾಜ ಶಿಲ್ಪಿ, ಪರಿವರ್ತನೆಯ ದಿಕ್ಸೂಚಿ ಡಾ. ಬಿ.ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್

  ಮೈಸೂರು,ಏಪ್ರಿಲ್,14,2025 (www.justkannada.in): ಡಾ. ಬಿ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ರವರು ವಿಶ್ವಮಾನ್ಯರಾಗಿ...

വനിതകൾ മാത്രമുള്ള ബഹിരാകാശ ദൗത്യം ചരിത്ര വിജയം, ബഹിരാകാശത്ത് പാട്ടുപാടി കാറ്റി പെറി

വാഷിങ്ടൺ: വനിതകൾ മാത്രം പങ്കാളികളായ ഓട്ടോമേറ്റഡ് ബ്ലൂ ഒറിജിന്റെ എൻ.എസ് 31ബഹിരാകാശ...

பாமக: 'நல்ல அறிகுறி தெரிகிறது; விரைவில் நல்ல செய்தி வரும்'- கட்சி விவகாரம் குறித்து ஜி.கே.மணி

பாமக நிறுவனர் ராமதாஸ் கடந்த வாரம் கட்சியின் தலைவராகவும், நிறுவனராகவும் தானே...