13
Sunday
April, 2025

A News 365Times Venture

AAI Recruitment 2025: డిగ్రీ అర్హతతో.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్..

Date:

డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తీపికబురును అందించింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 309 పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు భౌతిక శాస్త్రం, గణితంతో సైన్స్‌లో మూడేళ్ల పూర్తి సమయం రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ (B.Sc.) కలిగి ఉండాలి. లేదా ఏదైనా విభాగంలో ఇంజనీరింగ్‌లో పూర్తి సమయం రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉండాలి.

Also Read:UP: 7 రోజులు బంధించి, 23 మంది సామూహిక అత్యచారం.. ఇంటర్ విద్యార్థినిపై దారుణం..

అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలు కలిగి ఉండాలి. రిజర్డ్వ్ కేటాగిరి వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది. SC/ST/PwBD/మహిళలు/అప్రెంటిస్‌లకు మినహాయింపు ఇచ్చారు. ఈ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష- అప్లికేషన్ వెరిఫికేషన్/ వాయిస్ టెస్ట్/ సైకోయాక్టివ్ సబ్‌స్టాన్సెస్ టెస్ట్/ సైకలాజికల్ అసెస్‌మెంట్/ ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్/ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ (పోస్టుకు వర్తించే విధంగా) ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.40000 నుంచి 140000 జీతం ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 25-04-2025న ప్రారంభమై 24-05-2025న ముగుస్తుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಜಾತಿ ಗಣತಿ ವರದಿ ವಿರೋಧಿಸುವವರು ಅಂಕಿ ಅಂಶ ಆಧಾರವಾಗಿಟ್ಟುಕೊಂಡು ವಾದಿಸಲಿ- ಸಚಿವ ಕೆ.ಎನ್ ರಾಜಣ್ಣ

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,12,2025 (www.justkannada.in): ನಿನ್ನೆ ಸಚಿವ ಸಂಪುಟ ಸಭೆಯಲ್ಲಿ ಮಂಡನೆಯಾಗಿರುವ ಜಾತಿ...

ട്രംപിനെതിരായ പര്യടനം; ലോസ് ആഞ്ചലസില്‍ സാന്‍ഡേഴ്സിനൊപ്പം തടിച്ചുകൂടിയത് പതിനായിരങ്ങള്‍

വാഷിങ്ടണ്‍: ലോസ് ആഞ്ചലസില്‍ നടന്ന റാലിയില്‍ യു.എസ് സെനറ്ററും ഡെമോക്രറ്റിക് പാര്‍ട്ടി...

America: சீன தயாரிப்பானாலும் போன், லேப்டாப்களுக்கு வரி விலக்கு – பின்வாங்கும் ட்ரம்ப்!

அமெரிக்க அதிபர் ட்ரம்ப்பின் நிர்வாகம், கம்பியூட்டர், ஸ்மார்ட் போன்கள் மற்றும் சில...

Viral : అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరంట.. క్శశ్చన్‌ పేపర్‌లో విద్యార్థినీ సమాధానం వైరల్

Viral : సాధారణంగా చిన్నారులు పరీక్షల సమయంలో తమ ఊహాశక్తిని ఉపయోగించి...