Ram Gopal Varma: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కింది.. విచారణకు రావాలంటూ సీఐడీ అధికారులు ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు.. అయితే, సీఐడీ నోటీసులను ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు వర్మ.. ఇక, సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ రాంగోపాల్ వర్మ వేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వర్మకు ఊరట కలిగించే విషయం చెప్పింది హైకోర్టు.. విచారణలో వర్మపై తొందరపాటు చర్యలు తీసుకో వద్దని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం..
Read Also: Off The Record: విజయసాయిరెడ్డి మనసు మార్చుకున్నారా..? అందుకేనా పొలిటికల్ కామెంట్స్..?
కాగా, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులు అందాయి. దానికి తోడు విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని వర్మకి సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.. ఇక, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌పై గతంలో సోషల్ మీడియాలో వర్మ పెట్టిన పోస్టులపై కూడా కేసులు నమోదు అవ్వడంతో.. వర్మ పోలీసు విచారణకు హాజరైన విషయం విదితమే..