ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు. తన మొదటి ఓవర్లోనే డేంజరస్ క్వింటన్ డికాక్(1) వికెట్ పడగొట్టాడు హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. దీంతో ఆతిథ్య జట్టు 14 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాతి ఓవర్లో.. సునీల్ నరైన్(7)ను షమీ వెనక్కి పంపాడు.
Also Read:Ram Gopal Varma: హైకోర్టులో ఆర్జీవీకి ఊరట.. సీఐడీకి ఆదేశాలు..
వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే (కెప్టెన్), రింకూ సింగ్, అంక్రిష్ రఘువంశీ బ్యాటు ఝుళిపించారు. రఘువంశీ 32 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడి 60 పరుగులతో విరుచుకుపడ్డాడు. రహానే 27 బంతుల్లో 1 ఫోర్ 4 సిక్సులు బాది 38 పరుగులు సాధించాడు. రింకూ 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి 32 పరుగులు సాధించాడు. కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. సన్ రైజర్స్ కు 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.