TTD Development: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి తిరుమల పవిత్రత, ప్రాశస్త్యం, పరిరక్షణ ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది.. తిరుమలలో సంస్కరణలు 1983 నుంచి వేగవంతమైంది చెప్పవచ్చు. ఎన్టీఆర్ సీఎం అయిన తరువాత తిరుమలలో అనేక మార్పులు చేర్పులు చేసారు. భక్తులకు సౌకర్య కల్పనలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. తిరుమలలో అనేక సంస్కరణలు బీజం ఎన్టీఆర్ వేస్తే గాని కొనసాగింపు చంద్రబాబు చేస్తున్నారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం, అన్నప్రసాద ట్రస్ట్ ప్రారంభం వంటివి అన్న ఎన్టీఆర్ హయంలో ప్రారంభమైనవే. స్విమ్స్ హాస్పిటల్, బర్డ్ హాస్పిటల్ వంటివి అన్న ఎన్టీఆర్ మానస పుత్రికలు. శేషాచలం కొండలలో పచ్చదనం పెంపు కార్యక్రమం ప్రారంభించింది కూడా ఎన్టీఆర్‌య్యే.. శేషాచలం కొండలపై హెలిక్టాపర్ ద్వారా విత్తనాలు చల్లి సప్తగిరులను పచ్చగా మార్చారు. మరో వైపు తిరుమలలో మహాద్వార నిభందనలు అమలులోకి తీసుకువచ్చింది. ఆలయంలో మీరాశి వ్యవస్థ రద్దు చేసింది.. శ్రీవారికి రాష్ర్ట ప్రభుత్వం తరపున సీఎం పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం ప్రారంభమైంది కూడా ఎన్టీఆర్ హయాంలోనే.. ఇలా తిరుమల అభివృద్ధి పై ఎన్టీఆర్ హయంలో ఒక మార్క్ ఏర్పడింది. అటు తరువాత చంద్రబాబు కూడా ఇదే మార్క్ ని కొనసాగిస్తూ వచ్చారు.
Read Also: Mallikarjun Kharge: రాజ్యసభలో ఇంట్రెస్టింగ్ సీన్.. మల్లికార్జున్ ఖర్గే నోట ‘పుష్ప’ డైలాగ్
తిరుమల అభివృద్ధి పై చంద్రబాబు మొదటి నుంచి పట్టుదలగా వుండేవారు. సీఎం సొంత ప్రాంతం కావడం.. వారి కులదైవం కావడం.. అన్నింటికి మించి కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైన శ్రీవారి క్షేత్రం పవిత్రతను కాపాడేందుకు ప్రాధాన్యత ఇచ్చేవారు. గతంలో సీఎంగా వున్న సమయంలో రాజకీయ జోక్యానికి కూడా చంద్రబాబు అంగీకరించేవారు కాదు. అధికారులు కన్నుసన్నలోనే తిరుమల పరిపాలన వ్యవహారాలు కొనసాగేది. గతంలో ఎమ్మెల్యేగా వున్న చదలవాడ కృష్ణమూర్తి తిరుమల స్థానికులకు మద్దతుగా సీఎం దగ్గర అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేసిన సీఎం వారించి.. తిరుమల విషయంలో జోక్యం చేసుకోవద్దు సుతిమెత్తగా హెచ్చరించారు. ఇక తిరుమలలో అత్యంత క్లిష్టమైన మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకుంది చంద్రబాబు సీఎంగా వున్న సమయంలోనే.. ఆలయ అభివృద్ధి కోసం మాడవీధులతో పాటు తిరుమలలో వున్న ప్రైవేట్ ఆస్తులు టీటీడీ స్వాధీనం చేసుకొని.. వాటిని భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి చేసింది చంద్రబాబు హయాంలోనే.. పెద్దవారికి ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ప్రాణదాన పథకాని చంద్రబాబే ప్రారంభించారు. తిరుమలలో శ్రీవారి భక్తులకు శాశ్వత ప్రాతిపాదికన త్రాగునీటి కష్టాలు తొలగించేందుకు తిరుపతి కళ్యాణి డ్యాం నుంచి తిరుమలకు నీరు తరలించేందుకు పైపు లైన్ ఏర్పాటు చేసింది చంద్రబాబు సీఎంగా వున్న సమయంలోనే.. ఇలా గతంలో సీఎంగా వున్న సమయంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన చంద్రబాబు..
Read Also: Supreme Court: మమతా బెనర్జీ సర్కార్‌కు భారీ ఎదురుదెబ్బ.. టీచర్ల నియామకాలు రద్దు
తాజాగా, సీఎంగా భాధ్యతలు స్వీకరించిన తరువాత తిరుమల పై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. సీఎంగా భాద్యతలు స్వీకరించిన వెంటనే స్వామివారి ఆశీస్సులు పొందడానికి తిరుమలకు వెళ్లిన సీఎం.. తిరుమల ప్రక్షాళన ప్రారంభిస్తున్నామని.. తమ ప్రభుత్వ హయంలో తిరుమల పవిత్రతను కాపాడేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. అందులో భాగంగా తిరుమలకు వచ్చిన ప్రతి సారి అధికారులతో సమావేశం అవుతూ భక్తులకు కల్పించే సౌకర్యాలపై దిశా నిర్దేశం చేయడం ప్రారంభించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మించాలని ఆదేశించిన సీఎం.. తాజాగా విదేశాల్లో కూడా ఆలయాలు నిర్మాణానికి వున్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. తిరుమలలో పచ్చదనాన్ని 67 శాతం నుండి 80 శాతానికి పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. శ్రీవారి ప్రసాదం నాణ్యత పెంచేందుకు నాణ్యమైన నెయ్యిని వినియోగించేలా మార్పులు తీసుకురాగా.. ఆర్గానిగ్ ముడుసరుకులు స్థానంలో గతంలో వున్న విధానాన్ని తిరిగి తీసుకువచ్చారు. మరో వైపు ఏఐ టెక్నాలజీని వినియోగించి శ్రీవారి భక్తులకు సులుభతరంగా సేవలు అందించడానికి వున్న అవకాశాలను పరిశీలించాలని.. వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు టీటీడీ అందించే సేవల వివరాలను తెలిపేందుకు పారదర్శకతతో కూడిని విధానాన్ని అమలులోకి తీసుకురావాలని సూచించారు.. అలిపిరి వద్ద భక్తుల సౌకర్యార్థం బేస్ క్యాంప్ ఏర్పాటు, మాడవీధుల గ్యాలరీ విస్తరణ వంటి అంశాలపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం.. టీటీడీ రాబోవు 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో వుంచుకొని తిరుమలను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇలా మొత్తంగా తిరుమల అభివృద్ధి పై మరోసారి మాస్టర్ మైండ్ తో సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.