4
Friday
April, 2025

A News 365Times Venture

Off The Record : కామారెడ్డి బీఆర్‌ఎస్‌ రౌండ్ టేబుల్ సమావేశం.. నాకు చెప్పకుండా పెడతారా అంటూ ఆ నేత సీరియస్

Date:

కామారెడ్డి గులాబీ తోటలో కుంపట్లు అంటుకున్నాయా? ఆ మాజీ ఎమ్మెల్యే ఇగో డీప్‌గా హర్ట్‌ అయిందా? నాకు ముందు చెప్పకుండా…. నా సెగ్మెంట్‌లో మీటింగ్‌ పెడతారా? ఆ పని చేసింది పార్టీ పెద్ద అయితే ఏంటీ? మరొకరైతే ఏంటి? డోంట్‌ కేర్‌ అన్నారా? తన అనుచరుల్ని సైతం వెళ్ళకుండా అడ్డుకున్న ఆ బీఆర్‌ఎస్‌ నాయకుడు ఎవరు? ఏంటా ఇగో యవ్వారం? కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ వ్యవహార శైలిపై..పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోందట. బీసీ బిల్లు ఆమోదం పొందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు…. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీ కుల సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు. అందులో భాగంగా… ఇటీవల కామారెడ్డి కేంద్రంగా.. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు కవిత. ఈ సమావేశానికి బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ , పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ కు ఆహ్వానం పంపారట. కానీ సదరు నేతలు ఇద్దరూ డుమ్మా కొట్టారు. అంతేకాదు…. తమ వర్గీయులను సైతం వెళ్లకుండా కట్టడి చేశారట ఆ ఇద్దరు. స్వయంగా కవిత ఏర్పాటు చేసిన మీటింగ్‌కు వీళ్ళిద్దరూ వెళ్ళకపోవడం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసిందట. మీటింగ్‌కంటే ఎక్కువగా ఈ ఇద్దరు నేతల డుమ్మా కొట్టడం గురించే మాట్లాడుకుంటున్నారట. అయితే దీని వెనక చాలా కారణాలున్నాయని అంటున్నారు. గంప గోవర్ధన్‌కు బీఆర్‌ఎస్‌లో సీనియర్ బీసీ నేతగా గుర్తింపు ఉంది. ఐతే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్టీ పై అసంతృప్తితో రగిలిపోతున్నారట ఆయన. పార్టీ అధినేత కోసం తన సీటు త్యాగం చేసినప్పటికీ.. ఎన్నికల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని నొచ్చుకున్నారట గంప.

పుండు పై కారం చల్లినట్లు తనను సంప్రదించకుండా తన నియోజకవర్గంలో బీసీల రౌండ్ టేబుల్ సమావేశం తేదీ ప్రకటించడం, ఆయన్ను కాదని మాజీ టీఎస్పీఎస్సీ సభ్యురాలు సుమిత్రానంద్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో.. సదరు మాజీ ఎమ్మెల్యే ఈగో హర్ట్ అయినట్టు తెలిసింది. దీంతో ఆయన సమావేశానికి రాకుండా..చివరికి తన వర్గీయులు కూడా వెళ్లకుండా కట్డడి చేశారనే టాక్ నడుస్తోంది జిల్లాలో. కామారెడ్డి నియోజకవర్గంలో జరిగిన సమావేశానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే బీసీ నేత జాజుల సురేందర్ హాజరయ్యారు. ఆయన సైతం ఇష్టంగా కాకుండా కష్టంగానే సమావేశానికి వచ్చారని చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ ఇంచార్జీలను కాదని, కామారెడ్డిలో మహిళా నేతకు, ఎల్లారెడ్డి కి చెందిన మాజీ గ్రంథాలయ సంస్ధ చైర్మన్ సంపత్ గౌడ్ కు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల లోలోపల రగిలిపోతున్నారట సదరు మాజీలు.అయితే… అందర్నీ కలుపుకుని పోవాలన్న పట్టుదలతో ఉన్న కవిత… గంపకు సర్దిచెప్పినట్టు తెలుస్తోంది. బీసీ రౌండ్ టేబుల్ సమావేశం పార్టీలో చిచ్చురేపేదాకావెళ్ళినా…. కవిత జోక్యం చేసుకుని మాజీ ఎమ్మెల్యే ఈగోను గో అనేలా చేసినట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఇందుకు ఆయన పూర్తిగా కన్విన్స్‌ అయ్యారా లేదా అన్నది తేలాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Off The Record: మళ్లీ బ్రేక్‌.. తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎందుకు ఆగిపోయింది..?

Off The Record: అదిగో పులి అంటే….. ఇదిగో తోక అన్నట్టు...

ಬಸ್ ಚಾಲಕನಿಗೆ ಹೃದಯಾಘಾತ: ಪಾದಚಾರಿ ಮಹಿಳೆಗೆ ಡಿಕ್ಕಿ: ಇಬ್ಬರೂ ಸಾವು

ಮೈಸೂರು,ಏಪ್ರಿಲ್,2,2025 (www.justkannada.in): ಚಲಿಸುತ್ತಿದ್ದ ಕೆಎಸ್ ಆರ್ ಟಿಸಿ ಬಸ್ ಚಾಲಕನಿಗೆ...

‘ഗിബ്ലി’ ഇഫക്ടില്‍ നേട്ടം കൊയ്ത് ഓപ്പണ്‍ എ.ഐ; ചാറ്റ് ജി.പി.ടി ഉപയോഗം റെക്കോര്‍ഡ് നിലയില്‍

സാന്‍ഫ്രാന്‍സിസ്‌കോ: സമൂഹമാധ്യമങ്ങളിലെ ഗിബ്ലി തരംഗത്തില്‍ നേട്ടം കൊയ്ത് ഓപ്പണ്‍ എ.ഐ ചാറ്റ്‌ബോട്ടായ...

`கூட்டாட்சி தத்துவத்தின்மீது முன்னெப்போதும் இல்லாத அளவுக்கு கடும் தாக்குதல்…' – பிரகாஷ் காரத்

``தொகுதி மறுசீரமைப்பு நடவடிக்கை மூலம் 2026 க்கு பிறகு தென் மாநிலங்களின்...