3
Thursday
April, 2025

A News 365Times Venture

Bangladesh: ఈశాన్య రాష్ట్రాలే టార్గెట్.. భారత్‌ని బెదిరించేలా మహ్మద్ యూనస్ కామెంట్స్..

Date:

Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనస్ చైనా పర్యటనలో ఉన్నాడు. ఇప్పటికే, పాకిస్తాన్‌తో స్నేహం చేస్తున్న బంగ్లాదేశ్, ఇప్పుడు చైనాతో చెలిమిని పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఇదిలా ఉంటే, మహ్మద్ యూనస్ భారత్‌ని బెదిరించేలా చైనాలో కామెంట్స్ చేయడమే ఇప్పుడు సంచలనంగా మారింది. భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలకు లక్ష్యంగా చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఈ ప్రాంతంలో విస్తరించాలని చైనాను యూనస్ కోరాడు. ‘‘భారతదేశంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న ఏడు రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్‌గా ఉన్నాయి. వాటికి సముద్రాన్ని చేరుకునే అవకాశం లేదు. మొత్తం ఈ ప్రాంతానికి (ఈశాన్య భారతదేశం) కోసం మనం(బంగ్లాదేశ్) సముద్రానికి ఏకైక సంరక్షులం’’ అని యూనస్ చెప్పాడు. ఇది చైనాకు భారీ అవకాశాన్ని తెరుస్తుందని, ఇది చైనా ఆర్థిక వ్యవస్థ మరింత విస్తరించేందుకు సాయపడుతుందని, వస్తువుల్ని తయారు చేయండి, వాటిని మార్కెట్ చేయండి, చైనాకు తీసుకెళ్లండి లేదా ప్రపంచంలో మిగిలిన ప్రాంతాలకు ఎగుమతి చేయండి అని యూనస్ కోరాడు.

Read Also: Waqf bill : ఏప్రిల్ 2న లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు..

బంగ్లాదేశ్‌లో చైనా పెట్టుబడులు పెట్టాలని కోరుతూ.. ఈశాన్య రాష్ట్రాల గురించి ప్రస్తావించడంలో ప్రాముఖ్యత ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. యూనస్ కావాలనే భారత్‌ని బెదిరించే విధంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలే కాకుండా, యూనస్ నేపాల్, భూటాన్ దేశాలను కూడా ప్రస్తావించారు. బంగ్లాదేశ్‌లో చైనా పెట్టుబడులను ఆకర్షించాడు. యూనస్ చేసిన ఈ వ్యాఖ్యలు చాలా ఆందోళనకరంగా ఉందని, స్పష్టత అవసరమని భారత విదేశాంగ నిపుణులు అడిగారు. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో చైనా పాల్గొనాలని యూనస్ బహిరంగంగా పిలుపునిస్తున్నారా.? అని ప్రశ్నిస్తున్నారు.

భారత సరిహద్దుల్లో చైనా విస్తరణ మనదేశానికి ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే పాకిస్తాన్‌లో గ్వాదర్ పోర్ట్, సీపెక్‌తో పాగా వేసింది. బంగ్లాదేశ్‌లో మోంగ్లా ఓడరేవును ఆధునీకీకరించేందుకు ఒప్పందం చేసుకుంది. దీంతో పాటు నదీ జలాల నిర్వహణపై బంగ్లాదేశ్‌కు 50 ఏళ్ల సాయం అందించాలని యూనస్‌ చైనాని కోరాడు. గతంలో పలుమార్లు, బంగ్లాదేశ్ నేతలు భారత్ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ‘‘సిలిగురి కారిడార్(చికెన్స్ నెక్)’’ బ్లాక్ చేస్తామని కామెంట్స్ చేశారు. దీనిని బట్టి చూస్తే యూనస్‌తో పాటు బంగ్లా నాయకులు భారత్‌కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Waqf Bill: లోక్‌సభలో వక్ఫ్ బిల్లు కాపీలు చించేసిన అసదుద్దీన్ ఒవైసీ

వక్ఫ్ సవరణ బిల్లుపై బుధవారం లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరిగింది. అధికార-ప్రతిపక్ష...

ನಟ ದರ್ಶನ್ ಗೆ  ಜಾಮೀನು ಮಂಜೂರು ಪ್ರಶ್ನಿಸಿ ಸಲ್ಲಿಸಿರುವ ಅರ್ಜಿ ಇಂದು ವಿಚಾರಣೆ

ನವದೆಹಲಿ,ಏಪ್ರಿಲ್,2,2025 (www.justkannada.in):  ಚಿತ್ರದುರ್ಗದ ರೇಣುಕಸ್ವಾಮಿ ಕೊಲೆ ಪ್ರಕರಣಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ನಟ...

ഗുജറാത്ത് കലാപത്തിനിടെ ബ്രിട്ടീഷുകാരുടെ കൊല: ആറുപേരെ കുറ്റമുക്തരാക്കിയ വിചാരണ കോടതി വിധി ശരിവെച്ച് ഗുജറാത്ത് ഹൈക്കോടതി

അഹ്മദാബാദ്: 2002ലെ ഗുജറാത്ത് കലാപത്തിൽ മൂന്ന് ബ്രിട്ടീഷ് പൗരന്മാരെ കൊലപ്പെടുത്തിയ കേസിൽ...

WAQF Amendment Bill: 12 மணி நேர விவாதம்.. `வக்ஃப் வாரிய திருத்த மசோதா' மக்களவையில் நிறைவேற்றம்

12 மணி நேர காரசார விவாதத்திற்கு பிறகு, நேற்று மக்களவையில் வக்ஃப்...