అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వైట్‌హౌస్‌లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లింలతో కలిసి ట్రంప్ విందు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో ఓట్లు వేసినందుకు ముస్లింలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Houthis-Israel: ఇజ్రాయెల్‌పై హౌతీలు క్షిపణుల దాడి.. తిప్పికొట్టిన ఐడీఎఫ్
2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్ భారీ విజయం సాధించారు. ఇఫ్తార్ విందు సందర్భంగా ట్రంప్ ఈ విషయాలను గుర్తుచేశారు. లక్షలాది మంది ముస్లింలు.. ఎన్నికల్లో పాల్గొని తనకు మద్దతుగా నిలిచారని ట్రంప్ పేర్కొ్న్నారు. ముస్లిం సమాజమంతా తనకు అండగా నిలిచిందని.. అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ముస్లింలకు అండగా ఉంటానని ట్రంప్ హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Robinhood : రాబిన్ హుడ్ ఓవర్సీస్ ప్రీమియర్ టాక్