బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ అని మొదటి నుంచి చెబుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. నిన్న అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు అర్థం అయ్యిందన్నారు. నేడు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సమావేశంలో మా హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేక.. బీజేపీ ఎమ్మెల్యేల తో స్క్రిప్ట్ రాసి చదివి వినిపిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ నే బీజేపీ ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు చదువుతున్నారని విమర్శించారు.. నిన్న సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద సమాధానం లేక బీజేపీ ఎమ్మెల్యేలకు ఇచ్చి మాట్లాడించారన్నారు.. అన్ని అనుమతులతో కాళేశ్వరం కట్టామని.. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీనే అని గుర్తు చేశారు.. మరి కేంద్రంలో బీజేపి పార్టీ సమర్థవంతంగా పని చేయడం లేదా? అని ప్రశ్నించారు.
READ MORE: Flight On Tirumala: మరోసారి తిరుమల శ్రీవారి గోపురంపై నుంచి వెళ్లిన విమానం.. టీటీడీ ఆగ్రహం
కాంగ్రెస్ తరుపున మాట్లాడడం కంటే.. నేరుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటే సరిపోతుందని ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు.. “ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దలపై ఏర్పడిన ప్రభుత్వం.. తమ హామీలు, తమ బాధ్యతలు విస్మరిస్తూ పరిపాల చేస్తున్నారు.. అధికారంలో రాకముందు పీఆర్సీ, డీ.ఏ లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు.. ఈ రోజు మా పార్టీ తరుపున సభలో వాయిదా తీర్మానం పెడుతున్నాం.. తప్పకుండా ఉద్యోగులకు ప్రకటించిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం..” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE: 10th Class Exams: పదో తరగతి పరీక్షా పత్రం లీక్.. ముగ్గురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు!