Pakistan: పాకిస్తాన్ ఉగ్రవాదులకు ‘‘గుర్తుతెలియని వ్యక్తులు’’ భయాన్ని రుచి చూపిస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఎక్కడ నుంచి వచ్చి చంపుతారో తెలియక భారత వ్యతిరేక ఉగ్రవాదులు బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నారు. బయటకు వెళ్తే, తిరిగి ఇంటికి తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితులు అక్కడి ఉగ్రవాదుల్లో ఉన్నాయి. దీంతో కీలకమైన ఉగ్రవాదులు అండర్ గ్రౌండ్స్ వెళ్లారు. మరికొందరికి పాక్ ఐఎస్ఐ, ఇతర భద్రతా బలగాలు రక్షణ కల్పిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, 26/11 ముంబై దాడులకు కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రసంస్థ అధినేత హఫీజ్ సయీద్ బంధువు, లష్కరే తోయిబా నిధుల సేకరణకు సంబంధించిన ఖారీ షాజాదాను సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కరాచీ నగరంలోని ఖైరాబాద్ ప్రాంతంలోని జామియత్ ఉలేమా ఇస్లాం అనే సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న ఖారీ షాజాద్‌ని స్థానిక మసీదు సమీపంలో కాల్చి చంపారు. ప్రార్థనకు వెళ్తుండగా, దగ్గర నుంచి కాల్పులు జరిపి పారిపోయారు. ఇటీవల కాలంలో జామియత్ ఉలేమా ఇస్లామ్(JUI-F) వరసగా ఇది ఐదో దాడి. గత నెల కాలంలో ఇలాగే నలుగురు చనిపోయారు. తాజాగా ఖారీ హతమయ్యాడు.
Read Also: YouTube: మ్యూజిక్ లవర్స్ కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన యూట్యూబ్!
షాజాది లాగే ఇటీవల పేరు మోసిన పాకిస్తాన్ ఉగ్రవాదులు గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో మరణిస్తున్నారు. ఈ ఘటనల వెనక ఏదైనా వేరే దేశానికి చెందిన నిఘా ఏజెన్సీ పనిచేస్తుందా..? అని అనుమానిస్తున్నారు. పాక్‌లోని కొన్ని వర్గాలు ఈ టార్గెటెడ్ అటాక్స్‌లో భారత గూఢచార సంస్థ ప్రయేయం ఉందని ఆరోపిస్తున్నాయి. మరికొన్ని నివేదికల ప్రకారం, పాకిస్తాన్ సైన్యం కావాలనే ఇన్నాళ్లు వాడుకున్న ఉగ్రవాదుల్ని చంపేస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
పవిత్ర రంజాన్ మాసంలో వరసగా గుర్తుతెలియని వ్యక్తులు రెచ్చిపోతున్నారు. భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని వరసపెట్టి లేపేస్తున్నారు. ఇటీవల బెలూచిస్తాన్‌లో భారతీయుడు కుల్ భూషన్ జాదవ్‌ని కిడ్నాప్ చేసి, పాకిస్తాన్‌కి అప్పగించిన ఉగ్రవాది ముఫ్తీ షా మీర్‌ని కాల్చి ఇలాగే కాల్చి చంపారు. కొన్ని రోజులకు ముందు ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ టార్గెట్‌గా దాడి జరిగింది. ఈ దాడిలో ఉగ్రవాది, హఫీజ్ మేనల్లుడు అబూ ఖతల్ హతమయ్యాడు. హఫీస్ సయీద్ తీవ్రంగా గాయపడి , రావల్పిండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతను కూడా చనిపోయినట్లు ఊహాగానాలు వచ్చాయి. ఇదిలా ఉంటే, మరో నివేదిక ప్రకారం లష్కర్ రో ఉగ్రవాది అద్నాన్ అహ్మద్‌ని కూడా గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు సమాచారం.