27
Thursday
March, 2025

A News 365Times Venture

Venky Kudumula: ‘రాబిన్‌హుడ్’ నితిన్ కెరీర్‌లో బెస్ట్ మూవీ.. చిరంజీవితో నెక్స్ట్ సినిమా: వెంకీ కుడుముల

Date:

నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాబిన్‌హుడ్’ ఒక హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మార్చి 28న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించింది. రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పెషల్ కామియోలో కనిపించనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్ హిట్స్‌గా మారాయి. ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకీ కుడుముల విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు.

‘రాబిన్‌హుడ్’ జర్నీ ఎలా మొదలైంది?
“‘భీష్మ’ తర్వాత చిరంజీవి గారి కోసం ఓ కథ రెడీ చేశాను. ఆయనకు ఐడియా చెప్పగానే ఎంతో ఎక్సైట్ అయ్యారు. నేను చిరంజీవి గారి ఫ్యాన్‌బాయ్‌ని. అద్భుతంగా ఉండాలని స్టోరీ, స్క్రీన్‌ప్లే మీద చాలా సమయం తీసుకుని పనిచేశాను. కానీ ఎక్కడో ఆయన్ని సంతృప్తి పరచలేకపోయాను. మరో కథతో వస్తానని చెప్పాను. ఆ తర్వాత నితిన్ అన్నను కలిశాను. నేను హీరోకి తగ్గట్టు కథ రాస్తాను. ‘రాబిన్‌హుడ్’ ఐడియా గతంలోనే ఉంది, నితిన్‌తో ఫిక్స్ అయ్యాక ఆయన స్టైల్‌కి సెట్ చేశాను” అని వెంకీ వివరించారు.

నితిన్‌తో మళ్లీ వర్క్ చేయడం ఎలా అనిపించింది?
“‘భీష్మ’తో మా మధ్య కంఫర్ట్ లెవెల్ సెట్ అయింది. ‘అ ఆ’ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసినప్పటి నుంచి నితిన్ అన్నతో మంచి బాండింగ్ ఉంది. ‘రాబిన్‌హుడ్’ జర్నీ కూడా అదిరిపోయింది” అని అన్నారు.

హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
“ఇందులో నితిన్ ఒక మానిప్యులేటర్. ఫిజికల్ స్ట్రెంత్ కంటే మెంటల్ స్ట్రెంత్‌ని బిలీవ్ చేసే క్యారెక్టర్. సినిమా మొదటి 20 నిమిషాలు విభిన్న గెటప్స్‌తో హీరో ఇంట్రడక్షన్ అదరగొడుతుంది. ఆ తర్వాత కథ టర్న్ తీసుకుంటుంది. ఇది చాలా డిఫరెంట్ ఫిల్మ్. నితిన్ అన్న కెరీర్‌లో, నా కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది. ఫన్ ఎలిమెంట్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో ఉంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది” అని వెంకీ ఉత్సాహంగా చెప్పారు.

డేవిడ్ వార్నర్ ఎలా వచ్చారు?
“కామియో రోల్‌కి ఇంటర్నేషనల్ స్టార్ అయితే బాగుంటుందనుకున్నాను. నిర్మాతలు ఎవరని అడిగితే, ‘డేవిడ్ వార్నర్’ అన్నాను. నాకు క్రికెట్ అంటే పిచ్చి, వార్నర్ గేమ్ కూడా ఇష్టం. ఇది సాధ్యమవుతుందని అనుకోలేదు. కానీ నిర్మాత రవి గారు సీరియస్‌గా ట్రై చేసి, ఢిల్లీలో మీటింగ్ సెట్ చేశారు. వార్నర్‌కి ప్రజెంటేషన్ ఇచ్చాను, ఆయన ఎంతో ఎక్సైట్ అయ్యారు. ఆయన ఫ్యామిలీ మ్యాన్, పిల్లల కోసం రీల్స్ మొదలుపెట్టారని చెప్పారు. చాలా కాన్ఫిడెంట్‌గా యాక్ట్ చేశారు” అని వెల్లడించారు.

రాజేంద్రప్రసాద్ పాత్ర ఎలా ఉంటుంది?
“రాజేంద్రప్రసాద్ గారిది సినిమాలో కీలక పాత్ర. ఆయన సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతుంటారు. హీరో ఆయన్ని మానిప్యులేట్ చేసి సీరియస్ వరల్డ్‌లోకి తీసుకెళ్తాడు. ఆయన అమాయకంగా ఇరుక్కుంటారు. ఈ రోల్ రాసినప్పటి నుంచి ఆయనే సెట్ అనిపించారు” అని చెప్పారు.

శ్రీలీల క్యారెక్టర్ గురించి?
“శ్రీలీల పాత్ర చాలా ఫన్నీగా ఉంటుంది. తనకి టాలెంట్ ఉందని ఊహించుకునే ఇంటలెక్చువల్ టైప్ అమ్మాయి. ఆ క్యారెక్టర్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి గ్యారంటీ” అని నవ్వుతూ చెప్పారు.

జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఎలా ఉంది?
“జీవీ ప్రకాష్‌తో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఆయన సరైన టైంకి మ్యూజిక్ డెలివర్ చేస్తారు. పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బీజీఎం కూడా ఎక్స్‌ట్రాఆర్డినరీగా ఉంది. ‘అదిదా సర్ప్రైజ్’ పాట కథలో భాగంగానే వస్తుంది” అని తెలిపారు.

కేతిక శర్మ ఎందుకు?
“ప్రొడ్యూసర్స్ మొదట ‘పుష్ప’లో కేతికతో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారు, కానీ అప్పుడు కుదరలేదు. ఈ సినిమాలో ఆ ఆప్షన్ వచ్చినప్పుడు కేతిక అయితే బాగుంటుందని ఫిక్స్ చేశాం” అని వెల్లడించారు.

రిలీజ్ గ్యాప్‌లో సినిమాను బెటర్ చేశారా?
“డెఫినిట్‌గా! ఈ గ్యాప్‌లో మ్యూజిక్, పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీని బాగా ఎలివేట్ చేశాం. మంచి క్వాలిటీతో సినిమా రిలీజ్ అవుతుంది” అని హామీ ఇచ్చారు.

‘రాబిన్‌హుడ్’ టైటిల్ జస్టిఫికేషన్?
“అవసరమైన వాళ్ల కోసం నిలబడే హీరో రాబిన్‌హుడ్. ఈ కథకి ఈ టైటిల్ పర్ఫెక్ట్. మంచి మెసేజ్ కూడా ఉంది” అని చెప్పారు.

యాక్షన్ ఎలా ఉంటుంది?
“రామ్ లక్ష్మణ్ మాస్టర్స్‌తో ఎప్పటి నుంచో వర్క్ చేయాలనుకున్నాను. ఇంటర్వెల్ బ్లాక్‌ని వాళ్లే డిజైన్ చేశారు. విక్రమ్ మోర్, రియల్ సతీష్, రవి వర్మన్ మాస్టర్స్ కూడా యాక్షన్ అదిరిపోయేలా తీర్చిదిద్దారు” అని తెలిపారు.

మైత్రీ మూవీ మేకర్స్ గురించి?
“మైత్రీ టీం కథ ఓకే చేస్తే ఆ తర్వాత ఏ ఆలోచనా లేకుండా సపోర్ట్ చేస్తారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మిస్తారు” అని ప్రశంసించారు.

నితిన్‌తో చేసిన పాడ్‌కాస్ట్ సీన్ సినిమాలో ఉంటే?
“అది బయట చేసినందుకే బాగుంది. సినిమాలో సిచుయేషన్ లేకుండా పెడితే వర్కవుట్ కాదు” అని నవ్వారు.

డైలాగ్స్‌లో త్రివిక్రమ్ మార్క్ ఉందంటారు?
“అది నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. త్రివిక్రమ్ గారిని గురువుగా భావిస్తాను. ఆయనతో ఓ సినిమాకి పనిచేసి చాలా నేర్చుకున్నాను” అని చెప్పారు.

ఫ్యూచర్ జోనర్ ఏమిటి?
“నాకు చందమామ కథలంటే ఇష్టం. ఫాంటసీ టచ్‌తో కథలు చేయాలనుంది” అని ఆశయం వెల్లడించారు.

చిరంజీవితో సినిమా ఉంటుందా?
“డెఫినిట్‌గా చిరంజీవి గారితో సినిమా చేస్తాను”

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಪರಿಶ್ರಮದಿಂದ ವೃತ್ತಿಯಲ್ಲಿ ಯಶಸ್ಸು ಸಾಧ್ಯ – ಟಿ‌ಎಸ್ ನಾಗಾಭರಣ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್ 26,2025 (www.justkannada.in): ಯಾವ ವೃತ್ತಿಯು ಕನಿಷ್ಠವಲ್ಲ, ಬದ್ಧತೆ, ಪರಿಶ್ರಮಗಳು...

ഉത്തര്‍പ്രദേശില്‍ മാനസിക വെല്ലുവിളി നേരിടുന്ന കുട്ടികളുടെ പുനരധിവാസകേന്ദ്രത്തില്‍ ഭക്ഷ്യവിഷബാധ; രണ്ട് കുട്ടികള്‍ മരിച്ചു

ലഖ്‌നൗ: ഉത്തര്‍പ്രദേശിലെ പാരയില്‍ മാനസിക വെല്ലുവിളി നേരിടുന്ന കുട്ടികള്‍ക്കായുള്ള സര്‍ക്കാര്‍ പുനരവാസ...

'இது அரசியல் பிளாக் காமெடியின் உச்சம்' – யோகி ஆதித்யநாத் கருத்துக்கு ஸ்டாலின் காட்டம்

தற்போது, தமிழ்நாட்டில் மும்மொழி கொள்கை எதிர்ப்பு மற்றும் இந்தி திணிப்பு எதிர்ப்பு...

KP Vivekananda: అసెంబ్లీ బీజేపీ- కాంగ్రెస్ మధ్య పొత్తు అర్థమైంది..

బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ అని మొదటి...