26
Wednesday
March, 2025

A News 365Times Venture

CSK vs MI: చెన్నై శుభారంభం.. తొలి మ్యాచ్‌లో ఘన విజయం..

Date:

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై 4 వికెట్ల తేడాతో తొలి మ్యాచ్‌లో విజయ కేతనం ఎగుర వేసింది. 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గత 12 సంవత్సరాలుగా తొలి మ్యాచ్‌లో ఓటమి పాలవుతున్న ముంబై ఇండియన్స్ జట్టు.. ఈ ఏడాది కూడా అదే పరంపరను కొనసాగించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. గైక్వాడ్ (53) ఓట్ అవ్వగా.. రచిన్ రవీంద్ర(65) చివరి బంతి వరకు క్రీజ్‌లో కొనసాగాడు. చివరి క్షణంలో జడేజా(17) ఔట్ అవ్వడంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బరిలోకి దిగాడు.

READ MORE: CM Chandrababu Naidu: పంటనష్టంతో ఆత్మహత్యాయత్నం చేసిన రైతులపై సీఎం ఆరా

లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ ఓవర్‌లో రాహుల్ త్రిపాఠి(2) పెవిలియన్‌కు చేరుకున్నాడు. అనంతరం.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ అర్ధ సెంచరీ సాధించాడు.22 బంతుల్లో 6 ఫోర్లు, మూడు సిక్సర్లతో 50 పరుగులు పూర్తి చేశాడు. విఘ్నేశ్ ఓవర్‌లో గైక్వాడ్ (53) పెవిలియన్ బాట పట్టాడు. స్టార్ బ్యాట్స్‌మన్ శివం దూబే (9), దీపక్ హుడా(3), సామ్ కుర్రాన్(4), ఎంఎస్ ధోనీ(4) అనుకున్నంతగా రాణించలేక పోయారు. ఎంఎస్ ధోనీ (0) నాట్ అవుట్‌గా నిలిచాడు. మరోవైపు.. విఘ్నేష్ పుత్తూరు అద్భుతంగా బౌలింగ్ వేశాడు. మూడు స్టార్ క్రికెటర్‌ల వికెట్లు పడగొట్టాడు. విల్ జాక్స్, బోల్ట్ ఒక్కో వికెట్ తీశారు.

READ MORE: Robinhood Trailer: నితిన్ ‘రాబిన్ హుడ్’ ట్రైలర్ రిలీజ్.. వార్నర్ ఎంట్రీ మాములుగా లేదుగా!

కాగా.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తిలక్ వర్మ (31) టాప్ స్కోరర్. సూర్యకుమార్ యాదవ్ (29) ఫర్వాలేదనిపించాడు. రోహిత్ శర్మ డకౌటవ్వగా.. నమన్ ధీర్ (17), రియాన్ రికెల్‌టన్ (13), విల్ జాక్స్ (11), రాబిన్ మింజ్ (3), మిచెల్ శాంట్నర్ (11) పరుగులు చేశారు. చివర్లో దీపక్ చాహర్ (28) పోరాడటంతో ముంబయి స్కోరు 150 దాటింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ರಾಜಕೀಯವಾಗಿ ಹೆಚ್ ಡಿಕೆ ಭೇಟಿ ಮಾಡುವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ- ಡಿನ್ನರ್ ಮೀಟಿಂಗ್ ಕುರಿತು ಸಚಿವ ಚಲುವರಾಯಸ್ವಾಮಿ ನುಡಿ

ಮಂಡ್ಯ,ಮಾರ್ಚ್,26,2025 (www.justkannada.in):  ರಾಜ್ಯದಲ್ಲಿ ಹನಿಟ್ರ್ಯಾಪ್ ವಿಚಾರ ಸದ್ದು ಮಾಡುತ್ತಿರುವ ನಡುವೆಯೇ...

`மனிதாபிமானமற்ற அணுகுமுறை…' – அலஹாபாத் உயர் நீதிமன்றத் தீர்ப்பை நிறுத்திவைத்த உச்ச நீதிமன்றம்

உத்தரப்பிரதேச மாநிலத்தில் சிறுமி மீதான பாலியல் வன்கொடுமை முயற்சி வழக்கில், "மார்பகத்தைப்...

Odela 2: నాన్ థియేట్రికల్’కి కళ్ళు చెదిరే డీల్

తెలుగు సినిమా పరిశ్రమలో రాబోయే సంచలన చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన...