2
Wednesday
April, 2025

A News 365Times Venture

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం.. ఇదేం ట్విస్ట్..?

Date:

Vallabhaneni Vamsi Case: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సత్యవర్ధన్‌ కిడ్నాప్ కేసులో అరెస్ట్‌ అయిన వంశీ.. ప్రస్తుతం రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.. బెయిల్‌ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.. విచారణ వాయిదా పడుతూ వస్తోంది.. అయితే, ఈ కేసులో ఈ రోజు పెద్ద ట్విస్ట్‌ వచ్చి చేరింది.. వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వద్దని.. వంశీతో తనకి ప్రాణహాని ఉందంటూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు సత్యవర్ధన్‌.. దీంతో, ఈ కేసులో విచారణ అధికారి.. తమ ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.. ఈ నెల 26వ తేదీన ఈ కేసులో విచారణ అధికారి.. కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు.. మరోవైపు.. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు వల్లభనేని వంశీ మోహన్‌.. ఈ కేసులో కీలక పరిణామలు చోటు చేసుకోవడంతో.. ఈ నెల 25వ తేదీకి విచారణ వాయిదా వేసింది న్యాయస్థానం..

Read Also: Chiranjeevi : వాళ్ల ఇంటికి వెళ్లి భోజనం చేస్తా.. చిరంజీవి ఎమోషనల్

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಅಧೋಗತಿಗೆ ರಾಜ್ಯದ ಆರ್ಥಿಕ ಪರಿಸ್ಥಿತಿ: ಇದೊಂದು ಹುಚ್ಚು, ಮೂರ್ಖತನದ ಸರ್ಕಾರ-ಹೆಚ್.ವಿಶ್ವನಾಥ್

ಮೈಸೂರು,ಏಪ್ರಿಲ್,2,2025 (www.justkannada.in):  ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ ಗ್ಯಾರಂಟಿಗಳಿಂದ ರಾಜ್ಯ ಸರ್ಕಾರ, ರಾಜ್ಯದ...

പ്രസിഡന്റ് തെരഞ്ഞെടുപ്പില്‍ കമല ഹാരിസിനെ തോല്‍പ്പിക്കാനായി ഒബാമ ശ്രമിച്ചു; വെളിപ്പെടുത്തല്‍

വാഷിങ്ടണ്‍: യു.എസ് പ്രസിഡന്റ് തെരഞ്ഞെടുപ്പില്‍ ഡെമോക്രാറ്റിക് സ്ഥാനാര്‍ത്ഥിയായ കമല ഹാരിസിനെ തോല്‍പ്പിക്കാന്‍...

Adilabad Airport : ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్ లో...