20
Thursday
March, 2025

A News 365Times Venture

Harish Rao : బడ్జెట్‌లో అబద్దాల వెల్లువ.. పింఛన్లపై భ్రమలు..

Date:

Harish Rao : మాజీమంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు మేలు చేసేలా కాకుండా, పూర్తిగా అబద్దాలతో నిండిన బడ్జెట్‌గా ఆయన అభివర్ణించారు. అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రసంగాన్ని విమర్శిస్తూ, అది బడ్జెట్ ప్రసంగంలా కాకుండా రాజకీయ ప్రసంగంలా మారిపోయిందని అన్నారు. హరీష్ రావు ప్రకారం, బడ్జెట్‌లో పేర్కొన్న అనేక విషయాలు నిజాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా, వడ్డీ లేని రుణాల విషయాన్ని ప్రస్తావిస్తూ, కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్నది పూర్తిగా అబద్ధమని, అసలు వాస్తవం ఏమిటంటే 5 లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం అందుబాటులో ఉందని తెలిపారు.

అలానే, స్టిచింగ్ చార్జీల విషయంలో కూడా ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రకటించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.75 మాత్రమే చెల్లిస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్న విమర్శను ఖండించిన హరీష్ రావు, తమ హయాంలో 20 లక్షల మందికి రేషన్ కార్డులు మంజూరు చేశామని, ఇది ప్రభుత్వ రికార్డుల ద్వారా స్పష్టమవుతోందన్నారు.

హరీష్ రావు మహాలక్ష్మి పథకాన్ని ప్రస్తావిస్తూ, బడ్జెట్‌లో మహిళలకు రూ.2,500 ఇవ్వబోతున్నామని చెప్పినా, అసలు దీనిపై ఎలాంటి స్పష్టత లేదని అన్నారు. అంతేగాక, ఈ బడ్జెట్‌లో అందాల పోటీల కోసం రూ.250 కోట్లు కేటాయించారని ఎద్దేవా చేశారు. పింఛన్లను రూ.4,000 చేయలేదని, అలాగే లక్ష మంది లబ్ధిదారులను తొలగించారని హరీష్ రావు ఆరోపించారు. అదేవిధంగా, ప్రభుత్వం రైతులకు పూర్తిగా రుణమాఫీ చేశామని చెప్పినా, వాస్తవానికి ఎక్కడా అమలు చేయలేదని తెలిపారు.

హరీష్ రావు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావిస్తూ, రాష్ట్ర స్థూల ఉత్పత్తి తగ్గిపోయిందని, ప్రభుత్వం దివాళా తీసినట్టుగా ఉందని విమర్శించారు. మద్యం ఆదాయం ద్వారా రాష్ట్రానికి రూ.50,000 కోట్లు వస్తున్నాయని చెప్పిన హరీష్ రావు, ‘‘తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చేస్తారా?’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Chahal – Dhanashree: చాహల్-ధనశ్రీ విడాకులపై రేపు తీర్పు.. భరణం ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Robinhood: వార్నర్ కమింగ్.. ‘రాబిన్‌హుడ్’ ఈవెంట్’కి వెన్యూ కావలెను!

హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఈ సినిమా ప్రీ-రిలీజ్...

തമിഴ്‌നാട് ടാസ്മാക്കിലെ ഇ.ഡി റെയ്ഡ്; ജീവനക്കാരെ തടഞ്ഞുവെച്ചതില്‍ അതൃപ്തി അറിയിച്ച് മദ്രാസ് ഹൈക്കോടതി; നടപടികള്‍ വിലക്കി

ചെന്നൈ: തമിഴ്‌നാട് സര്‍ക്കാരിന്റെ മദ്യവില്‍പ്പന സ്ഥാപനമായ ടാസ്മാക് റെയ്ഡ് ചെയ്ത ഇ.ഡി...

புதுச்சேரி: “இதய நோய்க்கான மாத்திரையை வெளியே விற்கிறார்கள்..'' – அரசு மருத்துவமனையை சாடிய திமுக

புதுச்சேரி அரசு மருத்துவமனைகளில் வெளிப்புற சிகிச்சைப் பெற்று வரும் இதய நோயாளிகளுக்கு,...