17
Monday
March, 2025

A News 365Times Venture

CM Chandrababu : ఈ నెల 18న ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Date:

CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) ఈ నెల 18న ఢిల్లీ (Delhi) వెళ్లనున్నారు. ఈ పర్యటన రాజకీయంగా, పరిపాలనా పరంగా ఎంతో కీలకంగా మారింది. ముఖ్యంగా అమరావతి రాజధాని (Amaravati) అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కించేందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi)తో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా అమరావతిలో మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మోడీని అధికారికంగా ఆహ్వానించాలని టీడీపీ (TDP) వర్గాలు భావిస్తున్నాయి.

అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని అర్థాంతరంగా నిలిపివేయడంతో వేలాది మందికి నష్టమైంది. అయితే, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణాన్ని మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. నిర్మాణ పనుల కొరకు ప్రపంచ బ్యాంక్ (World Bank) సహా అనేక అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులను సమీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇటీవలే రెండు ప్రతిష్టాత్మక బ్యాంకులతో పాటు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HUDCO) కూడా అమరావతి అభివృద్ధికి రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఇక నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.

సీఎం చంద్రబాబు ఈ పర్యటనలో ప్రధాని మోడీతో పలు కీలక విషయాలను చర్చించనున్నారు. అందులో ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి నిధుల సమీకరణ, కేంద్రం నుంచి మద్దతు, అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధుల మంజూరు వంటి అంశాలు ఉండనున్నాయి. అమరావతిలో రహదారుల అభివృద్ధి, ల్యాండ్ పూలింగ్ విధానం, ప్లాట్ల వినియోగం, ప్రధాన హైవేలకు కనెక్టివిటీ వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

ముఖ్యంగా అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకారం అందించాలనే విషయాన్ని చంద్రబాబు ప్రధానితో ప్రస్తావించనున్నారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడానికి గతంలో జరిగిన అవాంతరాలను వివరించి, ఇకపై కేంద్ర సహకారంతో పనులను ముందుకు తీసుకెళ్లేలా ఒక క్లియర్ బాటలో నడవాలని నిర్ణయించారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అమరావతి పనులను ప్రధానితో కలిసి పునఃప్రారంభించాలని సూచించాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు మోడీని అధికారికంగా ఆహ్వానించనున్నారు. ప్రధానిని నిర్మాణ స్థలానికి ఆహ్వానించడానికి టీడీపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అమరావతి అభివృద్ధిపై కేంద్రం నుంచి అనుకూల నిర్ణయాలు తీసుకుంటే, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనను టీడీపీ నేతలు చాలా ప్రాముఖ్యతనిచ్చి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఎంపీలు ఈ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్ర మంత్రులతో కూడా చంద్రబాబు భేటీ అయ్యే అవకాశముంది. ముఖ్యంగా ఆర్థిక మంత్రి, గృహ మంత్రి తదితర కీలక నేతలతో రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనుల గురించి చర్చించనున్నారు.

ఢిల్లీలో జరిగే ఈ భేటీలు అమరావతికి కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంది. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రధానితో చర్చల అనంతరం రాష్ట్రంలో అమరావతి పనులు మరింత వేగంగా జరిగే అవకాశముంది. ప్రజలందరికీ ఆతృతగా ఎదురుచూస్తున్న అమరావతి నిర్మాణ పనులు మరోసారి కొత్త దిశగా సాగేలా ఈ భేటీ కీలక మలుపుగా మారనుంది.

Mohan Lal : మార్చి 27న థియేటర్లలోకి మోహన్ లాల్ ‘L2 ఎంపురాన్’..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಕಲುಷಿತ ಆಹಾರ ಸೇವನೆ. ಮೇಘಾಲಯ ರಾಜ್ಯದ ಒರ್ವ ವಿದ್ಯಾರ್ಥಿ ಸಾವು. 25 ಕ್ಕೂ ಹೆಚ್ಚು  ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಅಸ್ಚಸ್ಥ.!

  ಮಂಡ್ಯ, ಮಾ.16,2025: ಜಿಲ್ಲೆಯ ಮಳವಳ್ಳಿ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಕಲುಷಿತ ಆಹಾರ ಸೇವನೆ....

വഖഫ് ഭൂമിയുടെ കാര്യത്തിൽ തീരുമാനം എടുക്കേണ്ടത് വഖഫ് ബോർഡ്; മുനമ്പം ജുഡീഷ്യൽ കമ്മീഷൻ നിയമനം റദ്ദാക്കി ഹൈക്കോടതി

തിരുവനന്തപുരം: മുനമ്പത്ത് ജുഡീഷ്യൽ കമ്മീഷനെ നിയമിച്ച സർക്കാർ നടപടി റദ്ദാക്കി കേരള...

Karnataka: రాజకీయ దుమారం రేపుతున్న నర్సు హత్య.. కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ ఫైర్

యువ నర్సు దారుణ హత్య కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. లవ్ జీహాద్...