17
Monday
March, 2025

A News 365Times Venture

PM Modi: ఆర్ఎస్ఎస్ ద్వారానే జీవిత లక్ష్యం ఏంటో తెలిసింది..

Date:

PM Modi: ఆర్ఎస్ఎస్ ద్వారానే తనకు జీవిత లక్ష్యం గురించి తెలిసిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఆర్ఎస్ఎస్ గొప్పతనాన్ని ఆయన వివరించారు. ఆర్ఎస్ఎస్ వల్లే సేవ గొప్పతనం, దేశ స్పూర్తి పెరిగిందని వెల్లడించారు. బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ తాను ఒక వ్యక్తిగా ఎదిగేందుకు కీలక పాత్ర పోషించిందని చెప్పారు.

Read Also: PM Modi: “గుజరాత్ అల్లర్ల” గురించి మాట్లాడిన మోడీ.. ఏమన్నారంటే..

‘‘ఆర్ఎస్ఎస్ ద్వారా నేను జీవిత లక్ష్యాన్ని కనుగొన్నాను. అప్పుడు సాధువుల మధ్య కొంత సమయం గడపడం నా అదృష్టం. ఇది నాకు బలమైన ఆధ్యాత్మిక పునాదిని ఇచ్చింది. నేను క్రమశిక్షణ, జీవిత లక్ష్యాన్ని తెలుసుకున్నాను’’ అని మోడీ చెప్పారు. ఆర్ఎస్ఎస్ గత 100 ఏళ్లుగా గిరిజనులు, మహిళలు, కార్మికులు, యువత జీవితాలను స్పృశిస్తూ, తన శక్తిని సామాజిక ప్రయోజనాలకు అంకితం చేసిందని ప్రశంసించారు.

Read Also: Lex Fridman: ప్రధాని మోడీ ఇంటర్వ్యూ కోసం 45 గంటలు లెక్స్‌ ఫ్రిడ్‌మాన్ ఉపవాసం..

ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకులు యువతలో విద్యతో పాటు విలువలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తారని, తద్వారా వారు సమాజానికి భారంగా మారకుండా ఉండటానికి నైపుణ్యాలు నేర్చుకుంటారని మోడీ చెప్పారు. దేశానికి ఆర్ఎస్ఎస్ నిస్వార్థ సేవను ప్రధాని మోడీ కొనియాడారు, అలాంటి పవిత్ర సంస్థ నుంచి జీవిత విలువలను పొందడం తన అదృష్టమని చెప్పారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಕಲುಷಿತ ಆಹಾರ ಸೇವನೆ. ಮೇಘಾಲಯ ರಾಜ್ಯದ ಒರ್ವ ವಿದ್ಯಾರ್ಥಿ ಸಾವು. 25 ಕ್ಕೂ ಹೆಚ್ಚು  ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಅಸ್ಚಸ್ಥ.!

  ಮಂಡ್ಯ, ಮಾ.16,2025: ಜಿಲ್ಲೆಯ ಮಳವಳ್ಳಿ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಕಲುಷಿತ ಆಹಾರ ಸೇವನೆ....

വഖഫ് ഭൂമിയുടെ കാര്യത്തിൽ തീരുമാനം എടുക്കേണ്ടത് വഖഫ് ബോർഡ്; മുനമ്പം ജുഡീഷ്യൽ കമ്മീഷൻ നിയമനം റദ്ദാക്കി ഹൈക്കോടതി

തിരുവനന്തപുരം: മുനമ്പത്ത് ജുഡീഷ്യൽ കമ്മീഷനെ നിയമിച്ച സർക്കാർ നടപടി റദ്ദാക്കി കേരള...

Karnataka: రాజకీయ దుమారం రేపుతున్న నర్సు హత్య.. కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ ఫైర్

యువ నర్సు దారుణ హత్య కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. లవ్ జీహాద్...