14
Friday
March, 2025

A News 365Times Venture

Sunita Williams: సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి రావడానికి మార్గం సుగమం.. క్రూ-10 ప్రయోగానికి నాసా ఏర్పాట్లు

Date:

అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ ను తిరిగి తీసుకొచ్చే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతోంది నాసా. 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి రావడానికి మార్గం సుగమం అయ్యింది. సునీత విలియమ్స్‌ను తీసుకొచ్చేందుకు నాసా వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. క్రూ-10 ప్రయోగానికి నాసా రెడీ అవుతోంది. సాంకేతిక సమస్యతో నిన్నటి ప్రయోగం వాయిదా పడిన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున స్పేస్‌ఎక్స్ క్రూ-10 మిషన్ ప్రయోగించబోతున్న సమయంలో, ఫాల్కన్-9 రాకెట్ యొక్క గ్రౌండ్ సపోర్ట్ క్లాంప్ ఆర్మ్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో మిషన్‌ను రద్దు చేశారు.

Also Read:Rahul Dravid: నడవలేని స్థితిలో మైదానంలోకి రాహుల్‌ ద్రవిడ్‌.. దటీజ్‌ ‘ది వాల్’!

నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA), స్పేస్‌ఎక్స్ ఇప్పుడు తమ క్రూ-10 మిషన్‌ను శుక్రవారం సాయంత్రం 7:03 గంటలకు (EDT) ప్రారంభించనున్నట్లు ప్రకటించాయి. అంటే భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం 4:30 గంటలకు ప్రయోగం ప్రారంభంకానుంది. మార్చి 19 నాటికి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరే అవకాశం ఉందని నాసా తెలిపింది. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 20 తర్వాత సునీత, బుచ్ భూమికి చేరుకోనున్నట్లు తెలిపింది. సాంకేతిక కారణాల వల్ల కెన్నెడీ స్పేస్ సెంటర్ (ఫ్లోరిడా) నుంచి క్రూ-10 మిషన్ ప్రయోగాన్ని స్పేస్‌ఎక్స్ వాయిదా వేసిన 24 గంటల తర్వాత ఈ ప్రకటన చేశారు.

Also Read:Nagababu: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తో పాటు ఎవ్వరినీ వదలని నాగబాబు..

ఈ మిషన్ ద్వారా ISS కి ఒక కొత్త బృందం వెళ్లనుంది. ఇందులో NASA నుంచి అన్నే మెక్‌లేన్, నికోల్ అయర్స్, జపాన్ JAXA ఏజెన్సీ నుంచి టకుయా ఒనిషి, రష్యా రోస్కోస్మోస్ ఏజెన్సీ నుంచి కిరిల్ పెస్కోవ్ ఉన్నారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అనే ఇద్దరు వ్యోమగాములు బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్ళారు. కానీ స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపం కారణంగా తిరిగి రాలేకపోయారు. అంతరిక్షం నుంచి వీరిద్దరి రాకకోసం ప్రపంచం అంతా ఎదురుచూస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ನಕಲಿ ಔಷಧಿ ಜಾಲ ತಡೆಗಟ್ಟಲು ಕ್ರಮ -ಸಚಿವ  ದಿನೇಶ್ ಗುಂಡೂರಾವ್

  ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್ 13,2025:  ರಾಜ್ಯದಲ್ಲಿ ನಕಲಿ ಔಷಧ ಮಾರಾಟ ಜಾಲವನ್ನು...

വാഹനാപകടത്തില്‍ വ്‌ളോഗര്‍ ജുനൈദ് മരിച്ചു

മലപ്പുറം: തൃക്കലങ്ങോട് മരത്താണിയില്‍ ബൈക്ക് മറിഞ്ഞ് വ്‌ളോഗര്‍ ജുനൈദ് (32)മരിച്ചു. റോഡരികിലെ...

'Senthil Balaji-க்கு, இனி ஒவ்வொரு நிமிடமும் ஷாக்தான்' – நெருக்கும் ED | Elangovan Explains

இளங்கோவன் எக்ஸ்பிளைன்சில்,டாஸ்மாக் துறையில் ரூ 1000/- கோடி ரூபாய்க்கு மேல் முறைகேடு...

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

పవన్ అన్న అంటూ లోకేష్ ట్వీట్.. మంత్రి స్పెషల్ విషెస్ జనసేన 12వ...