17
Monday
March, 2025

A News 365Times Venture

Hero Splendor: తక్కువ ధరకే, మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కావాలా..!

Date:

ఇండియాలో చాలా మంది హీరో బైకులను నడపడానికి ఇష్టపడతారు. జనవరి 2025లో భారీగానే బైకులు సేల్ అయ్యాయి. గత నెలలో మొత్తం 6,28,536 యూనిట్ల అమ్మకాలు నమోదు అయ్యాయి. వీటిలో టాప్-5 బైక్‌లు ప్రత్యేక స్థానాలు సాధించాయి. అందులో హీరో స్ప్లెండర్ భారతదేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది.

హీరో స్ప్లెండర్:
హీరో స్ప్లెండర్ బైక్‌ను హీరో మోటోకార్ప్ చాలా కాలంగా అందిస్తోంది. ఈ బైక్ ప్రతి నెలా అత్యధిక అమ్మకాలను చేస్తోంది. జనవరి 2025 సమయంలో ఈ బైక్ అత్యధికంగా ఇష్టపడిన బైక్‌ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. గత నెలలో మొత్తం 2,59,431 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో మొత్తం 2,55,122 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ బైకు తక్కువ ధరతో పాటు మంచి మైలేజ్ కూడా అందిస్తుంది. సామాన్యులకు ఈ బైక్ అద్భుతంగా పని చేస్తుంది.

హోండా షైన్:
జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా ద్వారా షైన్ మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉంది. అమ్మకాల పరంగా ఈ బైక్ రెండవ స్థానంలో ఉంది. జనవరి 2025లో ఈ బైక్ మొత్తం 1,68,290 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఈ బైక్ 1,45,252 యూనిట్లు సేల్ అయ్యాయి. మంచి మైలేజ్ ఇచ్చే బైకులలో ఇది కూడా ఒకటి.

బజాజ్ పల్సర్:
బజాజ్ పల్సర్ మూడవ స్థానంలో నిలిచింది. సరికొత్త డిజైన్‌తో ప్రజలకు పరిచయం చేయబడిన ఈ బైక్.. గత నెలలో దేశవ్యాప్తంగా 1,04,081 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఈ బైక్‌ను 1,28,883 మంది కొనుగోలు చేశారు. డేటా ప్రకారం.. ఈ బైక్ అమ్మకాలు దాదాపు 20 శాతం తగ్గాయి.

హీరో HF Dlx:
హీరో మోటోకార్ప్ యొక్క HF Dlx బైక్ కూడా చాలా మందికి ఇష్టం. గత నెలలో ఈ బైక్ మొత్తం 62,223 యూనిట్లు అమ్ముడయ్యాయి. జనవరి 2025లో దేశవ్యాప్తంగా 78,767 యూనిట్లు సేల్ అయ్యాయి. టాప్-5 టీవీఎస్ బైక్‌లో టీవీఎస్ అపాచీ కూడా టాప్-5లో చోటు దక్కించుకుంది. గత నెలలో కంపెనీ అందిస్తున్న టీవీఎస్ అపాచీ బైక్‌ను కూడా 34,511 మంది కొనుగోలు చేశారు. గత సంవత్సరం జనవరి నెలలో ఈ బైక్‌ను 31,222 మంది కొనుగోలు చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

CM Chandrababu : ఈ నెల 18న ఢిల్లీకి సీఎం చంద్రబాబు

CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM...

ಗೋಲ್ಡ್ ಸ್ಮಗ್ಲಿಂಗ್ ಕೇಸ್:ಜಾಮೀನು ಕೋರಿ ಸೆಷನ್ಸ್ ಕೋರ್ಟ್ ಮೆಟ್ಟಿಲೇರಿದ ನಟಿ ರನ್ಯಾರಾವ್

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,15,2025 (www.justkannada.in):   ಚಿನ್ನಕಳ್ಳ ಸಾಗಾಣೆ ಪ್ರಕರಣದಲ್ಲಿ ಬಂಧಿತರಾಗಿ ನ್ಯಾಯಾಂಗ ಬಂಧನದಲ್ಲಿರುವ...

കേരളത്തില്‍ ഒറ്റപ്പെട്ടയിടങ്ങളില്‍ ഇടിമിന്നലോടുകൂടിയ മഴയ്ക്ക് സാധ്യത

തിരുവനന്തപുരം: സംസ്ഥാനത്ത് ഒറ്റപ്പെട്ടയിടങ്ങളില്‍ ഇന്നും നാളെയും 16.03.25, 17.03.25 തിയതികളില്‍ ഇടിമിന്നലോടു...

`புத்தாண்டு, ஹோலி…' அடிக்கடி வியட்நாம் செல்லும் ராகுல் காந்தி; காரணம் கேட்கும் பாஜக

மத்திய எதிர்க்கட்சித் தலைவர் ராகுல் காந்தி தற்போது தனிப்பட்ட பயணமாக வியட்நாம்...