21
Friday
February, 2025

A News 365Times Venture

Delhi Elections: పంజాబ్ సీఎం ఇంట్లో పోలీసులు సోదాలు.. బీజేపీ చెప్పినట్టుగా చేస్తున్నారని ఆప్ ఆరోపణ

Date:

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ప్రచారానికి సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అంతేకాకుండా మాటల యుద్ధం కూడా తారాస్థాయిలో నడుస్తోంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. యమునా నీళ్లపై ఆప్-బీజేపీ మధ్య డైలాగ్ వార్ ఏ రేంజ్‌లో సాగింది. తాజాగా ఢిల్లీలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సింగ్ ఇంటిపై పోలీసులు దాడి వ్యవహారం మరోసారి రచ్చరచ్చ చేస్తోంది. రెండు పార్టీల మధ్య విమర్శలు.. ప్రతివిమర్శలతో హాట్‌హాట్‌గా సాగుతోంది.

ఇది కూడా చదవండి: Electric Vehicles: పెట్రోల్ – డీజిల్ కంటే ఎలక్ట్రిక్ వాహనాలతో అధిక కాలుష్యం!

ఢిల్లీలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ ఇంటిపై పోలీసులు దాడి చేయడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి తప్పుపట్టారు. ఈ మేరకు అతిషి ట్విట్టర్‌ వేదికగా ధ్వజమెత్తారు. ‘‘బీజేపీ చేసిన తప్పులను, కాషాయ పార్టీ నేతలను మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదు. బీజేపీ నేతలు పట్టపగలే డబ్బులు పంచినా ఎందుకు పట్టించుకోవడం లేదు. ఎన్నికల కోసం వస్తువులను ప్రజలకు పంచేందుకు వెళుతున్నారు అయినప్పుటికీ పోలీసుల నుంచి స్పందన కరువైంది. కానీ.. ప్రజలు ఎన్నుకున్న నాయకుడి ఇంటి పైకి సోదాలు చేసేందుకు మాత్రం వచ్చారు’ అంటూ అతిషి మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: Etela Rajender : రాజకీయాలకు అతీతంగా ప్రజల బాధ్యతను తీసుకోవాలి..

అతిషి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. అతిషి ఆరోపణలపై బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఆప్‌ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మరోవైపు అతిషి ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. తాము సీఎం నివాసంలో ఎలాంటి సోదాలు చేపట్టలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్బంగా సీ-విజిల్‌ పోర్టల్‌లో వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు కోసం రిటర్నింగ్‌ ఆఫీసర్‌ నేతృత్వంలోని పోలీసు బృందం పంజాబ్‌ సీఎం నివాసానికి రావాల్సి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారి స్పష్టం చేశారు. అయితే భద్రతా సిబ్బంది పోలీసుల బృందాన్ని దర్యాప్తు చేసేందుకు అనుమతించలేదని స్పష్టం చేశారు.

 

 

 


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಮಾಹಿತಿ ಹಕ್ಕು ಕಾಯ್ದೆಯ ದುರುಪಯೋಗ, ದುರ್ಬಲಗೊಳಿಸುವುದನ್ನು ತಪ್ಪಿಸಿ- ಕೆ.ವಿ.ಪ್ರಭಾಕರ್

ಬೆಂಗಳೂರು ಫೆಬ್ರವರಿ,19,2025 (www.justkannada.in):  ಮಾಹಿತಿ ಹಕ್ಕು ಕಾಯ್ದೆಯ ದುರುಪಯೋಗವನ್ನು ಮತ್ತು...

അല്‍ അഖ്സയില്‍ പ്രവേശിക്കാന്‍ ഫലസ്തീന്‍ ഷെയ്ഖിന് ഇസ്രഈല്‍ പൊലീസിന്റെ വിലക്ക്

ജെറുസലേം: ജെറുസലേമിലെ അല്‍ അഖ്‌സ പള്ളിയില്‍ പ്രവേശിക്കുന്നതില്‍ ഫലസ്തീനിലെ പ്രമുഖനായ ഷെയ്ഖിന്...

`நான் CBSE பள்ளி நடத்தவில்லை; ஊடக விமர்சனத்திற்காக இப்படி…' – அண்ணாமலைக்கு திருமாவளவன் பதில்!

'மும்மொழிக் கொள்கையை ஏற்றால்தான் நிதி தருவோம்' என்று மத்திய கல்வித்துறை அமைச்சர்...

Vizag Crime: జ్యోతిష్యుడి మృతి కేసు ఛేదించిన పోలీసులు.. అసలు ఏం జరిగిందంటే..?

Vizag Crime: విశాఖలో జ్యోతిష్యుడు మృతి కేసును ఛేదించారు పోలీసులు.. బీమిలి...