20
Thursday
February, 2025

A News 365Times Venture

UPI Payments : షాకింగ్.. ఫిబ్రవరి 1 నుండి యూపీఐ పేమెంట్స్ చేయలేరు

Date:

UPI Payments : గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో యూపీఐ పేమెంట్స్ ఏ నెల కా నెల రికార్డులను నెలకొల్పుతున్నాయి. వీధి వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద బిజినెస్ లకు యూపీఐ పేమెంట్స్ అంగీకరిస్తున్నారు. ఈ యూపీఐ రోజురోజుకు విస్తరిస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఫిబ్రవరి 1, 2025 నుండి యూపీఐ పేమెంట్స్ చేయలేరని ఓ వార్త వినిపిస్తుంది. ఏదైనా యూపీఐ యాప్ లావాదేవీ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు అంటే (@, #, $ మొదలైనవి) ఉపయోగిస్తే ఆ లావాదేవీ రద్దు చేయబడుతుంది. భారతదేశంలో లావాదేవీ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లను ఉపయోగించే అనేక యాప్‌లు ఉన్నాయి. అయితే, Paytm, Phonepe వంటి సాధారణంగా ఉపయోగించే యాప్‌లు లావాదేవీ ఐడీలలో స్పెషల్ క్యారెక్టర్లను ఉపయోగించవు.

Read Also:Telangana Power Demand : విద్యుత్ సరఫరా కోసం నోడల్​ ఆఫీసర్లు ఎంపిక

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అన్ని యూపీఐ యాప్‌లను లావాదేవీ ఐడీ(ట్రాన్సాక్షన్ ఐడీ)లో ఆల్ఫాన్యూమరిక్ (అక్షరాలు, సంఖ్యలు) అక్షరాలను మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. యాప్‌లు ఈ నియమాన్ని పాటించకపోతే ఫిబ్రవరి 1, 2025 తర్వాత వాటి లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి. NPCI 9 జనవరి 2025న ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఫిబ్రవరి 1, 2025 నుండి అన్ని UPI యాప్‌లు ట్రాన్సాక్షన్ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్ల(@, #, $ మొదలైనవి) ఉపయోగించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Read Also:Yadagirigutta : టీటీడీ త‌ర‌హాలో యాద‌గిరి గుట్ట దేవ‌స్థానం బోర్డు…

ఏదైనా యూపీఐ యాప్ ఈ నియమాన్ని పాటించకపోతే ఆ యాప్ నుండి యూపీఐ లావాదేవీలు పనిచేయవు. ఈ నియమం వ్యాపార వినియోగదారులకు వర్తిస్తుంది. కానీ ఇది సాధారణ వినియోగదారులను కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే మీరు ఈ నియమాన్ని పాటించని ఏదైనా యాప్‌తో UPIని ఉపయోగిస్తే, మీ పేమెంట్స్ రద్దు చేయబడతాయి. ట్రాన్సాక్షన్ ఐడీని 35 అంకెల ఆల్ఫాన్యూమరిక్‌గా మార్చగలిగేలా ఈ మార్పు చేయడానికి NPCI ఇప్పటికే అన్ని యూపీఐ యాప్‌లకు సమయం ఇచ్చింది. దీనితో పాటు ఫేక్ ట్రాన్సాక్షన్ ఐడీలను నివారించాలని యాప్‌లకు కూడా సూచించింది. ఈ మార్పు వ్యవస్థను మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. లావాదేవీలను ట్రాక్ చేయడం సులభం అవుతుంది.. అంతేకాకుండా కస్టమర్ల భద్రత కూడా పెరుగుతుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ICC: పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన ఐసీసీ.. కారణమిదే..?

పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి ఆరంభం లభించలేదు. మహ్మద్...

BREAKING NEWS : ರಾಜ್ಯ ಬಜೆಟ್ ಬಳಿಕ ಹಾಲಿನ ದರ ಲೀಟರ್ಗೆ 5 ರೂ. ಹೆಚ್ಚಳ..!

ಬೆಂಗಳೂರು, ಫೆ.೨೦, ೨೦೨೫ : ಮಾರ್ಚ್ ನಿಂದ ಚಹಾ, ಕಾಫಿ,...

ഫലസ്തീനികള്‍ക്കായി നിലകൊള്ളും; യു.എസ് സ്റ്റേറ്റ് സെക്രട്ടറിയോട് നിലപാട് ആവര്‍ത്തിച്ച് യു.എ.ഇ

അബുദാബി: ഫലസ്തീനികളെ നിര്‍ബന്ധിതമായി കുടിയിറക്കാനുള്ള തീരുമാനത്തെ ശക്തമായി എതിര്‍ക്കുമെന്ന് ആവര്‍ത്തിച്ച് യു.എ.ഇ...

திருப்பத்தூர்: கட்டிமுடிக்கப்பட்டும் திறக்கப்படாத நியாயவிலைக் கட்டடம்; சிரமப்படும் மக்கள்!

திருப்பத்தூர் மாவட்டத்தில் மாடப்பள்ளி ஊராட்சியில் கடந்த 2021 ஆம் ஆண்டு அண்ணா...