భువనేశ్వర్, జనవరి 28, 2025: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్కర్ష్ ఒడిశా – మేక్ ఇన్ ఒడిశా కాంక్లేవ్ 2025 అనే ప్రముఖ రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి LN మిట్టల్, కుమార్ మంగలం బిర్లా, అనిల్ అగర్వాల్, కరణ్ అదాని, సజ్జన్ జిందాల్, నవీన్ జిందాల్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు 7,500 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.
ఇండియాలో ప్రముఖ పెట్టుబడి కేంద్రంగా ఒడిశా పెరుగుతున్న ప్రాముఖ్యతను ఈ కాంక్లేవ్ హైలైట్ చేస్తోంది. గ్రీన్ ఎనర్జీ, పెట్రోకెమికల్స్, మైనింగ్, టెక్స్టైల్స్, టూరిజం వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను ప్రదర్శిస్తోంది. దేశ అభివృద్ధి ప్రయాణంలో ఒడిశా కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని మోదీ పేర్కొని, పెట్టుబడిదారులు ఈ రాష్ట్రంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
సిఇఓ రౌండ్టేబుల్స్, పాలసీ చర్చలు, B2B మీటింగ్‌లతో కూడిన ఈ సమ్మిట్ ఒడిశా అభివృద్ధి మరియు పారిశ్రామిక మార్పులకు భరోసానిచ్చే భాగస్వామ్యాలకు దారితీసే వేదికగా నిలుస్తుంది.