14
Friday
March, 2025

A News 365Times Venture

Uttam Kumar Reddy : అద్భుతాలు చేస్తున్నట్లు కేసీఆర్, హరీష్ నటించారు.

Date:

Uttam Kumar Reddy : మాజీ మంత్రి హరీష్‌ రావు పచ్చి అబద్ధాలు, అసత్యాలు జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌. ఇరిగేషన్ ప్రాజెక్టులపై తప్పుడు ప్రాపగండా చేస్తున్నారని, అద్భుతాలు చేస్తున్నట్లు కేసీఆర్, హరీష్ నటించారన్నారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఇరిగేషన్ కు తీరని అన్యాయం జరిగిందని, లక్ష కోట్లు తెచ్చి కాళేశ్వరం కడితే వాళ్ళ టైమ్ లో కట్టిన ప్రాజెక్టు.. కూలిపోయిందన్నారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. వారి పరిపాలనకు అదే అద్దం పడుతోందని, ప్రతి విషయంలో అవగాహన లేకనో, అసమర్థతతోనో తీరని అన్యాయం చేసారని, అధికారం పోవడం హరీష్‌ రావు తట్టుకోలేక పోతున్నారని ఆయన విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టుతో 200టీఎంసీ ఏపీ తరలించుకు పోతుందన్నారని, ఇప్పటి వరకు ఒక్క చుక్క ఏపీ తరలించలేదన్నారు. ఈ విషయంలో మేము చాలా అప్రమత్తంగా ఉన్నామని, బనకచర్ల విషయంలో మేము కేంద్రానికి, బోర్డులకు లేఖ రాశామన్నారు. బనకచర్ల నిర్మాణం చట్ట వ్యతిరేకం అని కేంద్ర మంత్రులకు తెలియజేసామని ఆయన పేర్కొన్నారు.

Kakani Govardhan Reddy: విజయసాయి రెడ్డిపై కొందరు కుట్రలు, కుతంత్రాలు చేశారు..

అంతేకాకుండా..’కేఆర్ఎంబి, జిఆర్ఎంబికి లేఖ రాశాము. నిబంధనల కు విరుద్ధంగా నిర్మించ తలపెట్టిన బనకచర్లకు నిధులు కేటాయించవద్దని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు నేనే స్వయంగా లేఖ రాశా. వాటర్ డీస్ఫూట్స్ విషయంలో సెక్షన్3 కోసం స్వయంగా నేనే వాదనలు వినిపించా. తెలంగాణకు కేసీఆర్, హరీష్ ద్రోహం, దగా, మోసం చేశారు. బీఆర్ఎస్ హయాంలో 299 టీఎంసీ, 519 టీఎంసీలు ఏపీకి ఇవ్వండని అప్పటి ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి అడిగారు. మేము చెప్పింది నిజం, వాళ్ళు చెప్పింది అబద్ధం. కృష్ణా నీటి జలాల్లో తెలంగాణ కు 70 శాతం వాటా, ఏపీకి 30 శాతం వాటా ఇవ్వాలని అడగాల్సిన వ్యక్తులు అడగలేదు. 2016లో 519 టీఎంసీలు తీసుకుని మాకు 299 టీఎంసీలు ఇవ్వాలని రెండో సారి కూడా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 2017లో ముచ్చుమర్రి ప్రాజెక్టులో 6300క్యూసెక్కులకు పెంచుకోవడానికి మాకు అభ్యంతరం లేదని తెలంగాణ మంత్రి అన్నారు. 2020లో ఏపీ జీవో 203 రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 34 వేల క్యూసెక్కుల నీటిని తీసుకు పోతాం అని చెబితే నాటి ముఖ్యమంత్రి ఏమి మాట్లాడాలేదు.

అప్పుడు జగన్, కేసీఆర్ ఇద్దరు అలాయ్ బలాయ్ ఇచ్చుకుంటు ఉన్నారు. 2020లో ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గోదావరి, కృష్ణా నీటిని తీసుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తే కేసీఆర్ వాటిని పట్టించుకోలేదు. .తెలంగాణ రాక ముందు 44 వేల క్యూసెక్కులు తీసుకు పోతే. తెలంగాణ వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు ద్వారా 92600 వేల క్యూసెక్కుల నీటిని తీసుకు పోయారు. గతంలో కంటే hnss, మచ్చుమర్రి ద్వారా ఎక్కువ నీటిని తరలించుకుపోయారు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఉంటే ప్రతీ రోజు 4.1టీఎంసీలు తెలంగాణ రాకముందు డ్రా చేస్తే.. తెలంగాణ వచ్చిన తరువాత 9.6 టీఎంసీకి పెరిగింది అపెక్స్ కౌన్సిల్ సమావేశం 30.07.2020లో జరగాల్సి ఉంటే 10.08.2020 టెండర్లలో ఏపీకి ఇబ్బంది కలుగకుండా ఉండేందు కోసం పోస్టు ఫోన్ చేయించింది కేసీఆర్ ప్రభుత్వం.’ అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.

Delhi Metro: హస్తిన వాసులకు అలర్ట్.. 26న ఉ.3 గంటల నుంచే మెట్రో సేవలు

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Off The Record : పాలకుర్తి కాంగ్రెస్‌లో రచ్చకు కారణం వాళ్లేనా..?

పాలకుర్తి కాంగ్రెస్‌లో రచ్చకు కారణం ఎవరు? సొంత పార్టీ నేతలేనా? లేక...

‘ಕೈ’ ಕಾರ್ಯಕರ್ತರಿಗೆ ಸರ್ಕಾರಿ ಸಂಬಳ: ಮಂತ್ರಿಗಳು, ಅಧಿಕಾರಿಗಳು ಏನ್ ಕತ್ತೆ ಕಾಯುತ್ತಿದ್ದಾರಾ? ಕೇಂದ್ರ ಸಚಿವ ಪ್ರಹ್ಲಾದ್ ಜೋಶಿ ಕಿಡಿ

ಹುಬ್ಬಳ್ಳಿ,ಮಾರ್ಚ್,13,2025 (www.justkannada.in): ಗ್ಯಾರಂಟಿ ಅನುಷ್ಟಾನ ಸಮಿತಿಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾರ್ಯಕರ್ತರನ್ನ ನೇಮಿಸಿ...

എച്ചില്‍ ഇലയില്‍ ശയനപ്രദക്ഷിണം വേണ്ട; മനുഷ്യന്റെ ആരോഗ്യത്തിനും അന്തസിനും ഹാനികരം; മദ്രാസ് ഹൈക്കോടതി

ചെന്നൈ: തമിഴ്‌നാട്ടില്‍ എച്ചിലിലയില്‍ ശയനപ്രദക്ഷിണം വേണ്ടെന്ന് മദ്രാസ് ഹൈക്കോടതി. കരൂരിലെ ക്ഷേത്രത്തില്‍...

TASMAC: "டாஸ்மாக்கில் ரூ. 1,000 கோடி ஊழல்" – குற்றச்சாட்டுகளை அடுக்கும் அமலாக்கத்துறை; பின்னணி என்ன?

அமலாக்கத்துறை அதிகாரிகள் மார்ச் 6-ம் தேதி எழும்பூரில் டாஸ்மாக் தலைமை அலுவலகம்,...