5
Saturday
April, 2025

A News 365Times Venture

UP: విషాదం.. అలహాబాద్ ఐఐఐటీ హాస్టల్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

Date:

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన ఐఐఐటీ మొదటి సంవత్సరం విద్యార్థి రాహుల్ శనివారం రాత్రి హాస్టల్ క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లోని ఝల్వా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు. విద్యార్థి దివ్యాంగుడని పేర్కొన్నారు. 21వ పుట్టినరోజు జరుపుకోవడానికి ఒక రోజు ముందు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. సంఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని.. పరీక్షలో విఫలం చెందడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా దర్యాప్తులో తేలిందన్నారు. శనివారం రాత్రి 11:55 నిమిషాలకు ఐదో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడని.. పోలీసులు చేరుకునేలోపే చనిపోయాడని ధూమంగంజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) అజేంద్ర యాదవ్ తెలిపారు. ఇక దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేశామని.. 7 రోజుల్లో నివేదిక అందజేయాలని ఇనిస్టిట్యూట్ ఆదేశించింది.

కుమారుడు రాహుల్ మరణవార్త తెలియగానే ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ నుంచి తల్లిదండ్రులు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. అయితే ఆత్మహత్యకు ముందు రాహుల్.. తల్లి స్వర్ణలతకు మెసేజ్ పెట్టాడు. తమ్ముడిని, డాడీని జాగ్రత్తగా చూసుకోవాలని సందేశం పంపించినట్లు స్వర్ణలత తెలిపింది. మెసేజ్‌కు భయపడి వెంటనే ఫోన్ చేశానని.. కానీ ఆఫ్‌లో ఉందని.. వెంటనే స్నేహితుడికి ఫోన్ చేస్తే.. తెలుసుకోవడానికి వెళ్లాడని అకస్మాత్తుగా కాల్ డిస్‌కనెక్ట్ అయినట్లు తెలిపింది. 10 నిమిషాల తర్వాత కాల్ చేస్తే ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్పారని.. తీరా ఇక్కడి రాగానే చనిపోయినట్లు వార్త చెప్పారని స్వర్ణలత భోరున విలపించింది. కుమారుడు 6 నెలల నుంచి క్లాసులకు రావడం లేదని ఇన్‌స్టిట్యూట్ వాళ్లు చెప్పారని.. ఈ విషయం ముందుగానే ఎందుకు చెప్పలేదని స్వర్ణలత నిలదీశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಬಂಡೀಪುರ ರಾತ್ರಿ ಸಂಚಾರ ನಿರ್ಬಂಧ ವಿಚಾರ : ತುರ್ತು ಕ್ರಮಕ್ಕೆ ಲೋಕಸಭೆಯಲ್ಲಿ ಸಂಸದ ಯದುವೀರ್ ಆಗ್ರಹ

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,4,2025 (www.justkannada.in): ಬಂಡೀಪುರ ರಾತ್ರಿ ಸಂಚಾರ ನಿರ್ಬಂಧ ತೆರವಿಗೆ ತೆರಮರೆಯ...

തിരിച്ചടിച്ച് ചൈന; എല്ലാ യു.എസ് ഉത്പന്നങ്ങള്‍ക്കും 34 ശതമാനം അധിക തീരുവ പ്രഖ്യാപിച്ചു, ഏപ്രില്‍ 10 മുതല്‍ പ്രാബല്യത്തില്‍

ബെയ്ജിങ്: അമേരിക്കയുടെ തീരുവ ചുമത്തലിനെതിരെ തിരിച്ചടിച്ച് ചൈന. എല്ലാ യു.എസ് ഉത്പന്നങ്ങള്‍ക്കും...

முல்லைப்பெரியாறு பிரச்னை; 'எம்புரான்' படக் காட்சிகள் நீக்கப்பட்டது குறித்து சட்டப்பேரவையில் விவாதம்!

பிரித்விராஜ் இயக்கத்தில் மோகன்லால் நடிப்பில் வெளியாகியிருக்கும்  `எல் 2: எம்புரான்' அரசியல் தளத்தில்...

Off The Record : కొలికపూడి శ్రీనివాస్‌రావు పాలిట కత్తుల్లా మారిన టీడీపీ క్యాడర్..కారణం ఏంటి ?

ఆ టీడీపీ ఎమ్మెల్యే పాలిట కార్యకర్తలే కత్తుల్లా మారిపోయారా? ఆయనకు వ్యతిరేకంగా...