15
Saturday
March, 2025

A News 365Times Venture

BSNL: దూసుకుపోతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌.. 17ఏళ్ల తర్వాత భారీగా లాభాలు..

Date:

Bsnl Earned Profit Of More Than Rs 262 Crore For The First Time In 17 Years

బీఎస్‌ఎన్‌ఎల్‌కు మంచి రోజులు వచ్చాయి. కంపెనీ లాభం 17 సంవత్సరాలలో మొదటిసారిగా రూ.262 కోట్లకు పైగా పెరిగింది. 2007 తర్వాత కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించలేదు. లాభాలు ఈ విధంగా పెరగడానికి కారణం వేగవంతమైన నెట్‌వర్క్ విస్తరణ, తక్కువ ధరలకు సేవలను అందించడం అని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు. దేశంలో టెలికాం రంగం ప్రయాణంలో ఈ రోజు చాలా ముఖ్యమైనదని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ప్రధానమంత్రి నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. “భారతదేశ డిజిటల్ భవిష్యత్తుకు టెలికాం రంగం కీలక స్తంభంగా మారాలని ప్రధానమంత్రి ఆకాంక్షిస్తున్నారు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లందరూ ఈ లక్ష్యం కోసం నిజాయితీగా పనిచేస్తున్నారు. డిజిటల్ యుగంలో భారతదేశ టెలికాం రంగం కొత్త శిఖరాలకు చేరుకోవడానికి ప్రధానమంత్రి దార్శనికత కారణం..” అని మంత్రి పేర్కొన్నారు.

READ MORE: Anji Reddy Chinnamile: నెరవేర్చలేని హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు ఓట్లతో బుద్ధి చెప్పాలి

బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఎ. రాబర్ట్ మాట్లాడారు. “ఈ త్రైమాసికంలో మా ఆర్థిక పనితీరు పట్ల మేము సంతోషంగా ఉన్నాం. నెట్‌వర్క్ విస్తరణ, తక్కువ ధర, కస్టమర్లకు సరైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టాం. ఈ ప్రయత్నాలతో విజయం సాధించాం. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆదాయ వృద్ధి 20% కంటే ఎక్కువగా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. రూ. 262 కోట్ల రూపాయల లాభం ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్ మెరుగుపడుతూ.. స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుందని స్పష్టమైంది. కంపెనీ ఆర్థిక ఖర్చులు, మొత్తం వ్యయాన్ని కూడా తగ్గించుకుంది. దీనివల్ల గత సంవత్సరంతో పోలిస్తే నష్టాలు రూ. 1,800 కోట్లకు పైగా తగ్గాయి. టెల్కో తన మొబిలిటీ సేవల ఆదాయం 15% పెరిగింది. ఫైబర్-టు-ది-హోమ్ (FTTH) ఆదాయం 18% లాభం వచ్చింది. లీజుకు ఇచ్చిన లైన్ సేవల ఆదాయం కూడా 14% పెరిగింది.” అని ఆయన తెలిపారు.

READ MORE: Lalit Modi: వాలంటైన్స్ డే రోజున మరో కొత్త ప్రేయసిని పరిచయం చేసిన లలిత్ మోడీ

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ನಕಲಿ ಔಷಧಿ ಜಾಲ ತಡೆಗಟ್ಟಲು ಕ್ರಮ -ಸಚಿವ  ದಿನೇಶ್ ಗುಂಡೂರಾವ್

  ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್ 13,2025:  ರಾಜ್ಯದಲ್ಲಿ ನಕಲಿ ಔಷಧ ಮಾರಾಟ ಜಾಲವನ್ನು...

വാഹനാപകടത്തില്‍ വ്‌ളോഗര്‍ ജുനൈദ് മരിച്ചു

മലപ്പുറം: തൃക്കലങ്ങോട് മരത്താണിയില്‍ ബൈക്ക് മറിഞ്ഞ് വ്‌ളോഗര്‍ ജുനൈദ് (32)മരിച്ചു. റോഡരികിലെ...

'Senthil Balaji-க்கு, இனி ஒவ்வொரு நிமிடமும் ஷாக்தான்' – நெருக்கும் ED | Elangovan Explains

இளங்கோவன் எக்ஸ்பிளைன்சில்,டாஸ்மாக் துறையில் ரூ 1000/- கோடி ரூபாய்க்கு மேல் முறைகேடு...

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

పవన్ అన్న అంటూ లోకేష్ ట్వీట్.. మంత్రి స్పెషల్ విషెస్ జనసేన 12వ...