26
Wednesday
February, 2025

A News 365Times Venture

Allari Naresh: రీమేకులపై కన్నేసిన అల్లరి నరేష్?

Date:

ఈమధ్య వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్న అల్లరి నరేష్ బచ్చల మల్లి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భిన్నమైన కంటెంట్తో రావడంతో ఈసారి కచ్చితంగా హిట్టు కొడతాడని నమ్మకంతో వచ్చినా, ఆ సినిమా ఎందుకు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఆయన రీమేక్ సినిమాల మీద కన్నేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకు ఊతం ఇస్తూ మంగళవారం నాడు అల్లరి నరేష్ సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్రెడ్డితో కలిసి ప్రసాద్ ల్యాబ్ లో ఒక సూపర్ హిట్ తమిళ సినిమాని చూసినట్లుగా తెలుస్తోంది.

Tamil – Telugu: తెలుగు ప్రేక్షకుల ముందుకు ఒకేరోజు తమిళ సూపర్ హిట్- డిజాస్టర్ సినిమాలు

ఆ సినిమా అల్లరి నరేష్ కి సూట్ అవుతుందని భావిస్తే కనుక దాన్ని ఆయన రీమేక్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఒకప్పుడు వరుస కామెడీ సినిమాలు చేస్తూ వస్తున్న అల్లరి నరేష్ తర్వాతి కాలంలో ట్రెండ్ మార్చాడు. సీరియస్ సబ్జెక్ట్స్ ఎంచుకోవడమే కాదు కంటెంట్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటూ వస్తున్నాడు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలా పెర్ఫామ్ చేసినా అల్లరి నరేష్ పెర్ఫామెన్స్ గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకునేలా సినిమాలో ఉంటున్నాయి. ఇక ఇప్పుడు ఆయన రీమేక్ సినిమాల మీద ఫోకస్ చేసినట్లుగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో సినిమా చూడడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇదేమీ ఫైనల్ కాదు బహుశా అల్లరి నరేష్ కి నచ్చిన తర్వాత చేయాలనుకుంటే చేస్తారేమో వేచి చూడాలి..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಶೀಲ ಶಂಕಿಸಿ ಪತ್ನಿ ಹತ್ಯೆ: ಅಂತ್ಯಕ್ರಿಯೆ ವೇಳೆ ಆರೋಪಿ ಪತಿ ಅಂದರ್

ಬೆಂಗಳೂರು,ಫೆಬ್ರವರಿ,26,2025 (www.justkannada.in):  ಶೀಲ ಶಂಕಿಸಿ ಪತ್ನಿಯನ್ನ ಹತ್ಯೆಗೈದು ಅಂತ್ಯಕ್ರಿಯೆ ನಡೆಸಲು...

സുഡാനില്‍ സൈനിക വിമാനം തകര്‍ന്ന് 46 പേര്‍ കൊല്ലപ്പെട്ടു; പത്ത് പേര്‍ ഗുരുതരാവസ്ഥയില്‍

ഖാര്‍ത്തൂം: സുഡാനില്‍ സൈനിക വിമാനം തകര്‍ന്ന് 46 പേര്‍ കൊല്ലപ്പെടുകയും പത്ത്...

`பிரசாந்த் கிஷோர் உள்ளூரிலேயே விலை போகாதவர்..!” – கே.என்.நேரு விமர்சனம்!

திருச்சி மத்திய மற்றும் வடக்கு மாவட்ட தி.மு.க செயற்குழு கூட்டம்...

Success Tips : మీరు ఈ నియమాలు పాటిస్తే.. విజయం మీ సొంత!

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కోరుకుంటారు. కానీ విజయం...